కొంతమంది నేతలు చేసేటువంటి కొన్ని తప్పుల వల్ల కొన్ని సందర్భాలలో పార్టీలకు కూడా చెడ్డ పేరు వస్తూ ఉంటుంది. అలా ఇప్పటికే సోషల్ మీడియా వల్ల చాలామంది నేతల గుట్టురట్టు కూడా అయ్యింది. ఇప్పుడు తాజాగా మధ్యప్రదేశ్ లోని మందసౌర్ జిల్లాకు చెందిన బిజెపి నేత మనోహర్ లాల్ కు సంబంధించిన ఒక వివాదాస్పదమైన వీడియో సోషల్ మీడియాని షేక్ చేయడమే కాకుండా రాజకీయాలను కూడా కుదిపేస్తోంది. అయితే ఈ వీడియో మే 13న 2025 రాత్రి ముంబై- ఢిల్లీ ఎక్స్ప్రెస్ హైవే పైన సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయినట్లుగా తెలుస్తోంది.



ఈ వీడియోలో బిజెపి నేత మనోహర్ లాల్ ఒక మహిళతో కలిసి అభ్యంతరకమైన పనులు చేస్తూ సీసీ కెమెరాకి చిక్కారు. ఒక తెల్లని కారు వద్ద తన పని కానిచ్చినట్లుగా ఈ సీసీటీవీ ఫుటేజ్ లో కనిపిస్తుంది. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో లీక్ అయిన వెంటనే క్షణాలలో వైరల్ గా మారింది. దీంతో మందసౌర జిల్లా లో పోలీస్ కేసు కూడా నమోదు అయినట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ బీజేపీ నేతపైన భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు.


అయితే ఈ బీజేపీ నేతతో ఉన్న ఆ మహిళ ఎవరు గుర్తించే ప్రయత్నాలు అయితే ప్రస్తుతం చేస్తున్నట్లు సమాచారం. కారు నెంబర్ ప్లేట్ ఆధారంగానే గుర్తించారట.ఈ వీడియో వైరల్ గా మారడంతో ఆ బిజెపి నేత ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మందసౌర బిజెపి జిల్లా అధ్యక్షుడు దీక్షిత్ మాత్రం అక్కడ ఉన్నది మనోహర్ లాల్ కాదు అంటూ తెలియజేస్తున్నారు. కేవలం ఆన్లైన్ ద్వారా సభ్యత్వం తీసుకున్న వ్యక్తి ఎవరైనా ఉండవచ్చు అని ఈ వీడియో పైన ప్రస్తుతం దర్యాప్తు చర్యలు జరుగుతున్నాయని అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామని తెలుపుతున్నారు. అయితే ఈ వీడియో చూసిన పలువురు నేతలతో పాటు నెటిజన్లు కూడా తిట్టిపోస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: