
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆచితూచి వైసిపికి చెందిన నేతలను పాత కేసులు బయటకు లాగి అరెస్టులు చేయడం జరుగుతూ వస్తోంది. ఇప్పటికే కృష్ణా జిల్లాకు చెందిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్టు చేశారు. వంశీకి బెయిల్ వచ్చినట్టే వచ్చి రాకుండా పోతున్న పరిస్థితి. తాజాగా నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన రెడ్డిని సైతం పోలీసులు కేరళలో అరెస్టు చేశారు. ఇక కూటమి ప్రభుత్వం నెక్స్ట్ టార్గెట్ ఎవరు ? అన్న ప్రశ్నకు ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన వైసిపి పైర్ బ్రాండ్ మాజీ మంత్రి గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని పేరు వినిపిస్తోంది. నాని నిన్న మొన్నటి వరకు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు అన్న చర్చ సాగింది. తాజాగా ఆయన హైదరాబాదులో పెళ్లి వేడుకలు చాలా స్టైలిష్ గా ప్రత్యక్షమయ్యారు. నిజానికి నాని ఆరోగ్యం పై జరిగిన ప్రచారంతో పోల్చుకుంటే ప్రస్తుతం ఆయన రూపురేఖలను బట్టి ఆరోగ్యంగా బాగానే ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది.
నానిలో మునుపటి మాదిరిగానే నానిలో హుషారు ఉంది. గత ఏడాది ఎన్నికలలో గుడివాడ నుంచి కొడాలి నాని ఓడిపోయారు. 20 ఏళ్లుగా నాని ఓటమి అనేది ఎరుగని నాయకుడిగా ఉన్నారు. అలాంటిది తాజా ఓటమి ఆయనను కుంగదీసింది.. పైగా తాను ఎన్నికలలో పోటీ చేయటం ఇదే చివరిసారి తనను గెలిపించాలని కూడా నాని ప్రజలకు విన్నవించిన గుడి ఓటరు మార్పు దిశగానే అడుగులు వేశారు తప్ప నాని గోడు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో నాని దిగులుతో పాటు ఇతర కారణాలతో అనారోగ్యం పాలయ్యారన్న ప్రచారం కూడా జరిగింది. కొన్నాళ్లు హైదరాబాదులోనూ తర్వాత బెంగళూరులోనూ నాని చికిత్స తీసుకున్నారు.
అయితే నాని ఆరోగ్యంపై వదంతులు కూడా హల్చల్ చేశాయి. ప్రస్తుతం నాని అనారోగ్యంతో ఉన్నారని చర్చ అయితే సాగుతుంది. అలాంటిది ఒక పెళ్లి వేడుకలు ఆయన ప్రత్యక్షం కావడంతో పాటు చాలా యాక్టివ్ గా కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇక ఇప్పుడు తెలుగుదేశం సర్కిల్స్‌లో నెక్స్ట్ టార్గెట్ నాని అంటున్నారు. గుడివాడలో ఇసుక , మట్టి భూముల ఆక్రమణ కేసులు నానిపై ఉన్నాయి. దీనికి తోడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిర్వహించిన కేసీనో పైన చంద్రబాబు ప్రభుత్వం కేసు పెట్టింది. ఇప్పుడు వీటన్నింటిని తిరగ దోడాలని చూస్తున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు