
మహానాడులో మాంసాహారం కూడా వడ్డించనుండటం హాట్ టాపిక్ అవుతోంది. ప్రతిరోజూ భోజనాల్లో 20 వంటకాలకు తగ్గకుండా వడ్డించనున్నారని సమాచారం అందుతోంది. ఈ వంటకాల తయారీ కోసం 1700 మంది వంటవాళ్లతో పాటు వడ్డింపు కోసం 800 మంది పని చేయనున్నారు. తాపేశ్వరం కాజాతో పాటు ఒంగోలు అల్లూరయ్య మైసూర్ పాక్, చక్కెర పొంగళి, ఫ్రూట్ హల్వా లాంటి మిఠాయిలను సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది.
50 వేల గుడ్లను వడ్డించనున్నారని భోగట్టా. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్వయంగా ఆవకాయ పచ్చడి తయారు చేయడం హాట్ టాపిక్ అవుతోంది. అల్పాహారంలో భాగంగా టూటీ ఫ్రూటీ కేసరి, పొంగలి, ఇడ్లీ, టమోటా బాత్ తో పాటు కాఫీ, టీ కూడా ఇవ్వనున్నారని సమాచారం అందుతోంది. మధ్యాహ్న భోజనంలో గోంగూర చికెన్, ఆంధ్రా స్టైల్ చికెన్ కర్రీ, ఎగ్ రోస్ట్, రోటీ పచ్చడి, తెల్లన్నం, ప్లెయిన్ బిర్యానీ, సాంబారు, ఉలవచారు, మామిడికాయ పచ్చడి, పెరుగు వడ్డించనున్నారు.
శాఖాహారులకు గోంగూర పూల్ మఖానా, ప్లెయిన్ బిర్యానీ, టమోటా పప్పు, తెల్లన్నం, రోటీ పచ్చడి, పెరుగు, చిప్స్, ములక్కాయ టమోటా గ్రేవీ, బెండకాయ బూందీ వడ్డించనున్నారు. సాయంత్రం స్నాక్స్ లో భాగంగా కాఫీ, టీతో పాటు కార్న్ సమోసా, బిస్కెట్లు, పకోడీ, మిర్చి బజ్జీలు ఇవ్వనున్నారు. రాత్రి భోజనంలో భాగంగా రైస్ తో పాటు వంకాయ బఠానీ, ఆలూ ఫ్రై, పెసరపప్పు చారు, రోటీ పచ్చడి, పెరుగు ఇవ్వనున్నారు. మహానాడు మెనూ మాత్రం అదిరిపోయిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.