గతంలో కేంద్ర ప్రభుత్వం 500 నోట్లను రద్దుచేసి ఒక్కసారిగా ఒక సునామిని సృష్టించింది.అలాగే 1000, 2000 వేల రూపాయల నోట్లో కూడా రద్దు చేసింది. అయితే ఇప్పుడు తాజాగా మరొకసారి మళ్లీ పెద్ద నోట్ల రద్దు ని చేయాలని ప్రధాన నరేంద్ర మోదీనీ కోరానంటూ ఏపీ సీఎం చంద్రబాబు తెలియజేశారు.ఇటీవలే మహానాడు సభలో భాగంగా సీఎం చంద్రబాబు ఈ వ్యాఖ్యలను చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చలామణిలో ఉన్న 500 నోట్లను కూడా రద్దు చేసి ఆర్థిక లావాదేవీలను డిజిటల్ లోకి మార్చడం వల్ల అవినీతి కూడా తగ్గిపోతుందని సలహా ఇచ్చానని తెలిపారు .



అలాగే మంత్రి నారా లోకేష్ సలహాతోనే వాట్సాప్ గవర్నర్ ని కూడా తీసుకువచ్చామని.. మహిళలకు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు సౌకర్యాన్ని ఇవ్వబోతున్నామని  ఏపీలో ఉన్న ప్రతి వ్యక్తికి  భద్రత కల్పిస్తామంటూ సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. అన్నదాత సుఖీభవ రూ.20,000 రూపాయలను మూడు విడతలుగా ఇస్తామని రైతుల అకౌంట్లోనే ఈ డబ్బులను జమ చేస్తామంటూ తెలిపారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ పనితీరు గురించి ప్రజల నుంచి అభిప్రాయాలను కూడా సేకరిస్తామని పనిచేయని అధికారుల పైన ,మంత్రుల పైన కూడా కఠినమైన చర్యలు ఉంటాయని తెలిపారు.

 ఏపీ రాజధాని అమరావతిని కూడా పూర్తి చేస్తామని ,రాయలసీమను అభివృద్ధి దిశగా అడుగులు వేసేలా చేస్తామని తెలిపారు. అలాగే కడప కర్నూలు అనంతపురం జిల్లాలలో ఫ్యాక్షని పూర్తిగా అంతం చేసే బాధ్యత తనదే అంటే సీఎం చంద్రబాబు తెలిపారు. గడిచిన 5 సంవత్సరాలలో ఏ ఒక్క కాలువలకు కూడా నదికి కూడా ఒక రూపాయి ఖర్చు చేయలేదు.. అందుకే ఈసారి వెనుకబడిన ప్రాంతాల పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఏపి ని నెంబర్ వన్ గా మారుస్తానంటూ తెలిపారు చంద్రబాబు.ఏది ఏమైనా మహానాడు సభలో పెద్ద నోట్ల రద్దు సలహా ఇచ్చానని చెప్పడంతో ఇప్పుడు రాష్ట్రమంతట ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: