
Brs పార్టీని బిజెపిలో విలీనం చేసే కుట్రలు కూడా జరుగుతోందని ఆరోపణలు చేశారు. తాను జైల్లో ఉన్నప్పుడే ఈ ప్రతిపాదన తీసుకువస్తే తాను వ్యతిరేకించాలని తాను రాసిన లేఖను ఎవరూ బయటపెట్టారంటూ మీడియా చిట్ చాట్ లో భాగంగా ఫైర్ అయ్యింది ఎమ్మెల్సీ కవిత. తాను జైలుకు వెళ్ళినప్పుడు పార్టీకి ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తానంటే కేసీఆర్ గారి వద్దని చెప్పారని వివరించింది.. తండ్రి కేసిఆర్ అన్న కేటీఆర్ లక్ష్యంగా చేస్తూ పలు కీలకమైన వ్యాఖ్యలు చేసింది కవిత.
తనకు వెన్నుపోటు రాజకీయాలు తెలియవని తెలియజేస్తూ పార్టీని నడిపించే సత్తా లేని మీరు నాకు నీతులు చెబుతున్నారా అంటూ పరోక్షంగానే కేటీఆర్ ను టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది.. తాను 25 సంవత్సరాలుగా కేసీఆర్కు లేఖలు రాస్తున్నాను ఆ లేఖలను చదివిన తర్వాత చించేసేవారు కానీ ఇప్పుడు ఆ లేక బయటకి ఎందుకు వచ్చింది అన్నట్టుగా ప్రశ్నించింది. పరోక్షంగా కేసీఆర్ పైన అనుమానాలను వ్యక్తం చేస్తూ ఎమ్మెల్సీ కవిత ఇలా మాట్లాడినట్లు వినిపిస్తున్నాయి.. ఇక కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే పడవ అందులోకి తాను ఎందుకు వెళ్తానంటూ వ్యాఖ్యానించింది.. తాను కూడా కేసీఆర్ లాగే తిక్కదాన్నే అంటూ , ఎవరికీ భయపడనని, పార్టీని బలోపేతం చేసే పద్ధతి ఇదేనా అంటూ ఫైర్ అయ్యింది కవిత.