ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం మహానాడు సభ టిడిపి నేతలు కార్యకర్తలు చాలా సంబరంగా జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగా నారా లోకేష్ తో పాటు సీఎం చంద్రబాబు టిడిపి నేతలు కార్యకర్తలు సైతం పాల్గొన్నారు. అయితే ఇందులో నారా లోకేష్ కూడా ఆరు తీర్మానాలను తీసుకురావడం జరిగింది. వీటికి తోడు ప్రతి ఏడాది కూడా విడుదల చేసే పథకాల క్యాలెండర్ ను కూడా రిలీజ్ చేస్తామంటూ తెలిపారు. పలువురు నేతలు కూడా టిడిపి పార్టీ గురించి చెబుతూ ఈ సభ గ్రాండ్ సక్సెస్ చేసుకున్నారు.


ఈరోజుతో మహానాడు సభ పూర్తికానుంది. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నట్లు తెలియజేశారు. ఈ విషయాన్ని కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బరాయుడు తెలియజేశారు. తాడేపల్లి కాపు కార్యాలయంలో మాట్లాడుతూ కాపు మహిళలకు ఆర్థికంగా చేయూత ఇవ్వడానికి గృహిణి పథకాన్ని తీసుకురావాలని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తోంది అంటూ తెలియజేశారు. ఈ పథకం కింద ప్రతి కాపు మహిళకు కూడా 15,000 రూపాయలు అందించబోతున్నామని తెలిపారు.



ఈ పథకాన్ని అమలు చేయడానికి సుమారుగా 400 కోట్ల రూపాయలు బడ్జెట్ అవసరమవుతుందని తెలియజేశారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోనే కాపు సంక్షేమానికి 4,600 కోట్ల రూపాయలు కేటాయించారు అంటూ కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బరాయుడు వెల్లడించారు. అయితే కేవలం కాపు కార్పొరేషన్ కింద కాపు మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని చెప్పడంతో మహిళలందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని తిట్టిపోస్తున్నారు. ఎన్నికల ముందు అందరికీ ప్రతినెలా కూడా రూ.1500 రూపాయలు ఇస్తానని చెప్పి ఎన్నికలు అయిపోయిన తర్వాత పట్టించుకోలేదని ఇప్పుడు మళ్లీ కాపు కార్పొరేషన్ కింద కేవలం కాపు మహిళలకే ఇస్తానన్నడంతో ఫైర్ అవుతున్నారు.. మరి కొంతమంది మహిళలు మాత్రం ఈసారి ఎన్నికలలో మా తడాఖా ఏంటో చూపిస్తాను అంటూ తెలియజేస్తున్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వానికి సంబంధించి గ్రౌండ్ రియాల్టీ వేరేగా ఉందంటూ తెలుపుతున్నారు చాలామంది నేతలు.

మరింత సమాచారం తెలుసుకోండి: