కవిత ఎప్పుడైతే తండ్రి కేసీఆర్ కి లేఖ రాసిందో అప్పటినుండి బీఆర్ఎస్ బిజెపి గురించి ఒక సంచలన వార్త వెలుగులోకి వచ్చింది.అదేంటంటే కవిత లిక్కర్ కేసులో జైలు పాలైన సమయంలో కేసీఆర్, కేటీఆర్ ఇద్దరు బిజెపితో పొత్తు పెట్టుకొని కవితని ఎలాగైనా బయటికి తీసుకురావాలి అనుకున్నారట. అయితే ఇదే విషయాన్ని కవితతో జైల్లో ఉన్న సమయంలో అడగగా వద్దని చెప్పిందట. అయితే కవిత బయటికి రావడం వెనక బిజెపి ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కవిత బీఆర్ఎస్ బిజెపితో పొత్తు పెట్టుకోవాలి అనుకుంది అని మాట్లాడడం ఈ వార్తలకు మరింత ఊతమిచ్చింది.అయితే తాజాగా బిజెపిలోని కీలక నాయకులు అయినటువంటి బండి సంజయ్ రాజాసింగ్ వంటి వాళ్లు కూడా బీఆర్ఎస్ బిజెపితో పొత్తు పెట్టుకోవాలని చూసింది అని మాట్లాడడం రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసింది. 

అయితే రాజా సింగ్ మాట్లాడితే ఏదో ఆయన అలానే మాట్లాడుతుంటారులే అని కొంతమంది అనుకుంటారు. కానీ బండి సంజయ్ లాంటి కీలక నాయకుడు కూడా బీఆర్ఎస్ బీజేపీ పొత్తు గురించి మాట్లాడడం ప్రస్తుతం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.మరి ఇంతకీ బండి సంజయ్ ఏం మాట్లాడారంటే..కవిత లిక్కర్ కేసులో అరెస్ట్ అయినప్పుడు బీఆర్ఎస్ బిజెపితో కలవాలని చూసింది. అప్పుడే మా దగ్గరికి రానివ్వలేదు అంటూ మాట్లాడారు. అయితే ఈయన మాటలను బట్టి చూస్తే కవిత అరెస్టు ని ఆపడానికి అరెస్టు అయ్యాక జైలు నుండి బయటకు తీసుకురావడానికి బీఆర్ఎస్ బిజెపి కాళ్లబేరానికి వెళ్లింది. కానీ బిజెపి వాళ్లు మాత్రం ఒప్పుకోలేదని స్పష్టంగా అర్థమైంది. ఇదే విషయాన్ని కవిత కూడా చెప్పింది. జైల్లో ఉన్న సమయంలో బిజెపి బిఆర్ఎస్ పొత్తు గురించి మాట్లాడగా నేను ఖండించానని చెప్పడంతో బిఆర్ఎస్ బిజెపితో కలవాలని చూస్తుందని కానీ బిజెపి వాళ్లు దగ్గరికి రానివ్వడం లేదని అనుకుంటున్నారు.

ఇక రాజాసింగ్ అయితే పెద్ద ఆఫర్ ఇస్తే మా పార్టీలో ఉన్న చాలా మంది నాయకులు బిఆర్ఎస్ లోకి వెళ్తారు అని మాట్లాడడం మరో ఎత్తు.. అయితే బీఆర్ఎస్ తమతో కలవాలనుకుందని బండి సంజయ్ చెప్పినప్పటికీ ఆ తర్వాత మళ్లీ బీఆర్ఎస్ పై మండిపడ్డారు. ఎప్పటికీ బీజేపీలో బీఆర్ఎస్ ని కలవనివ్వమని, అది కుటుంబ పార్టీ అవినీతి పార్టీ అంటూ నిప్పులు చెరిగారు. మరి రాజాసింగ్ పెద్ద ఎత్తున డబ్బు ఆఫర్ వస్తే మీ పార్టీలోని నాయకులు బీఆర్ఎస్లోకి వెళ్తారని అంటున్నారు దానిమీద ఎలా స్పందిస్తారు అంటే.. ఈ విషయం గురించి రాజాసింగ్ నే అడగండి నన్నెందుకు అడుగుతున్నారు అంటూ బండి సంజయ్ ఫైర్ అయ్యారు.. ఏది ఏమైనప్పటికి బండి సంజయ్ రాజాసింగ్ మాట్లాడిన మాటలు కవిత చెప్పిన మాటలు ఇవన్నీ ఒకే రకంగా ఉండడంతో బిజెపి బీఆర్ఎస్ పొత్తు విషయం మరోసారి తెర మీదికి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: