జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎన్నికల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే పవన్ గెలుపు కోసం మాజీ ఎమ్మెల్యే వర్మ ఎన్నో త్యాగాలు చేయాల్సి వచ్చింది. అయితే గత కొంతకాలంగా పవన్ వర్మ మధ్య గ్యాప్ ఏర్పడిందని సోషల్ మీడియా వేదికగా వార్తలు వినిపించాయి. పిఠాపురం నియోజకవర్గం లో జనసేన నేతలు ఇసుక దందా చేస్తుండగా వర్మ అందుకు సంబంధించిన సాక్ష్యాలను బయట పెట్టడం సోషల్ మీడియా వేదికగా సంచలనం అవుతోంది
 
పిఠాపురంలో ఇసుక మాఫియా రెచ్చిపోతున్న నేపథ్యంలో వర్మ వెల్లడించిన విషయాలు సంచలనం రేపుతున్నాయి. మల్లి వారి తోటలో ఇసుక అక్రమ తవ్వకాలను పరిశీలించిన వర్మ రాత్రి కాగానే పిఠాపురం పోలీసులకు రేచీకటి వస్తోందని పోలీసులకు స్పెషల్ గ్లాసెస్ ఇవ్వాలని అన్నారు. అనుమతులు లేకుండా ఇసుక తవ్వుతున్నారని మాఫియాతో పోలీసులు సైతం కుమ్మక్కై పోయినట్టు ఉన్నారని ఆయన అన్నారు. రోజుకు 300 లారీల ఇసుక వెళ్ళిపోతుందని రాత్రుల సమయంలో అక్రమ రవాణా జరుగుతోందని తెలిపారు.
 
పోలీసులకు ఇసుక అక్రమ రవాణా కనిపించడం లేదంటే వాళ్ళ మామూళ్ళు వాళ్లకు వస్తున్నాయని పోలీసులు ముందే సమాచారం ఇచ్చి సర్దుకోమంటున్నారని వర్మ అన్నారు. ఇక్కడ ఇసుక దొంగతనం జరుగుతోందని చెబుతున్న ఎవరూ పట్టించుకోవడం లేదని వర్మ అభిప్రాయం వ్యక్తం చేశారు. 20 రోజులుగా ఈ విషయాలను పోలీసులకు చెబుతున్నా ఫలితం లేకుండా పోయిందని ఆయన అన్నారు.
 
రమణక్కపేటలో ఇసుక అక్రమ రవాణాకు శంకుస్థాపన చేశారని వర్మ కామెంట్ చేశారు. వర్మ ఆరోపణలపై పవన్ కళ్యాణ్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. వర్మ జనసేన నేతలు టార్గెట్గా కామెంట్లు చేసిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు వర్మ విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తారనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది.
 
 


మరింత సమాచారం తెలుసుకోండి: