విద్యార్థుల భవిష్యత్తు మారేది తరగతి గదిలోనే అంటారు మేధావులు. అలాంటి విద్యార్థుల భవిష్యత్తును మార్చేది టీచర్లే.  వారు ఎంత బాగా మనకు బోధిస్తే భవిష్యత్తు యువతకు అంత పునాది ఉంటుంది. అలాంటి టీచర్ వృత్తిలో ఉన్న వారిని ప్రభుత్వాలు ఎప్పుడు ఇబ్బందులకు గురి చేస్తూనే ఉంటాయి. అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా  టీచర్లకు ఇబ్బందులు కలిగించే నిర్ణయం తీసుకుంది. దీంతో ముకుమ్మడిగా టీచర్లు అంతా ఏకమై  డీఈఓ ఆఫీస్  ముందు, కలెక్టరేట్ కార్యాలయం ముందు  ధర్నా కార్యక్రమాలు నిర్వహించాయి. అలా ఎందుకు చేశాయి కారణాలు చూద్దాం.. కూటమి ప్రభుత్వం సైకో పరిపాలన లాగా చేయమని సీనియారిటీని బట్టి మాత్రమే ట్రాన్స్ఫర్లు చేస్తామని ప్రకటించారు. దీనివల్ల బదిలీల్లో ఎలాంటి ప్రాబ్లం రాదు అని లోకేష్ చెప్పుకొచ్చారు. 

ఆయన ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ ఇచ్చారో టీచర్లు వివాదానికి తెరలేపారు. సంఖ్య పరంగా అధికంగా ఉన్నటువంటి ఎస్జీటీలను  మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు చేపడతామని హామీ ఇచ్చి, ప్రస్తుతం ఆన్లైన్ లో పద్ధతి సాగుతుందని చెప్పడం వారికి అన్యాయం చేసినట్టు అవుతుందన్నారు. శనివారం ఆన్లైన్లో బదిలీ కౌన్సిలింగ్ జరుగుతున్న ప్రాంతాలన్నింటినీ బైక్ కట్ చేసి టీచర్లు నిరసన చేపట్టారు. ప్రస్తుతం పాఠశాల విద్యాశాఖలో 1.79 లక్షల మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఇందులో ఎస్జీటీలు 1,20,000 వరకు ఉన్నారు. ఇందులో సుమారు 65,000 మందికి స్థానచలనం కల్పించారు. ఇందులో 35,000 మంది 8ఏళ్ళు పూర్తయిపోయి తప్పనిసరి బదిలీల్లో ఉన్నారు.

విద్యాశాఖ ప్రకటించిన నిర్ణయం ప్రకారం ఈ నెల 10తో  కౌన్సిలింగ్ ప్రక్రియలన్నీ ముగిసిపోవాలి. విద్యాశాఖ వారు మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహిస్తామని హామీ ఇచ్చి ఆన్లైన్లోనే చేసుకోవాలని చెప్పడంతో ఉపాధ్యాయులు కంగుతిన్నారు. దీంతో ఆందోళన చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. సోమవారం మధ్యాహ్నం ఉపాధ్యాయ సంఘాలన్నీ కలిసి మంత్రి లోకేష్ కు వినతిపత్రం అందించి వెబ్ కౌన్సిలింగ్ కి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. అంతేకాకుండా టీడీపీ చెందిన ఎమ్మెల్సీలు కూడా నారా లోకేష్ నుంచి ఈ విషయాన్ని తీసుకెళ్లి మాన్యువల్ కౌన్సిలింగ్ మాత్రమే చేపట్టాలని నచ్చజెప్పి ఒప్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: