మనదేశంలో గత కొన్నేళ్లలో యూపీఐ ద్వారా లావాదేవీలు ఊహించని స్థాయిలో పెరిగిన సంగతి తెలిసిందే. చిన్న చిన్న వస్తువులను కొనుగోలు చేయాలన్నా ప్రస్తుతం గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, భీమ్, అమెజాన్ పే, వాట్సప్ పే ఇతర యూపీఐ అప్లికేషన్స్ పై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే యాప్స్ ద్వారా చేసే చెల్లింపులపై ఎలాంటి చార్జీలు లేవనే సంగతి తెలిసిందే. అయితే త్వరలో ఈ లావాదేవీలపై చార్జీలు విధించే దిశగా కేంద్రం అడుగులు వేస్తుండటం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.

ప్రముఖ న్యూస్ ఛానల్ ఇందుకు సంబంధించిన కథనాన్ని ప్రసారం చేయడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. ఎక్కువ మొత్తం విలువ ఉన్న డిజిటల్ లావాదేవీలను నిర్వహించడానికి ఖర్చులు పెరుగుతున్నాయని బ్యాంకులతోపాటు చెల్లింపుల సేవా సంస్థలు గత కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 3000 రూపాయలు అంతకుమించి లావాదేవీలపై చార్జీలను విధించే దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం అందుతుంది. అయితే కేంద్రం నుంచి ఈ మేరకు స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉంది.

అయితే కేంద్రం ఎం డి ఆర్ చార్జీలను తీసుకొని వచ్చినంత మాత్రాన యూజర్లపై నేరుగా ఎలాంటి ప్రభావం ఉండబోదని తెలుస్తోంది. ఎందుకంటే ఈ లావాదేవీల కోసం యూజర్ల నుంచి కాకుండా వ్యాపారుల నుంచి మాత్రమే చార్జీలను వసూలు చేయడం జరుగుతుంది. అందువల్ల యూజర్లు నష్టపోయే అవకాశం ఉండదు. ఇంతకాలంపాటు ఈ చార్జీలను భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తూ వచ్చింది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి:

upi