ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిన్న తల్లికి వందనం పథకం అమలు దిశగా అడుగులు వేయడం రాష్ట్ర మహిళల ఆనందానికి కారణమవుతోంది. ఈ పథకంలో భాగంగా 13 వేల రూపాయలు మహిళల ఖాతాలలో జమ కానున్నాయి. అయితే ఈ పథకానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయనే సంగతి తెలిసిందే. జులై నెల 5వ తేదీన ఈ స్కీమ్ నగదు మహిళల ఖాతాలలో జమ కానుందని సమాచారం అందుతోంది.

ఒకటో తరగతి,  ఇంటర్  ఫస్టియర్ లో  విద్యార్థులు చేరాల్సి ఉన్న నేపథ్యంలో  ఖాతాలలో  నగదు ఆలస్యంగా జమ కానుందని తెలుస్తోంది.  అయితే  ఇంట్లో ఎవరైనా ఫీజు రీయింబర్సమెంట్ పొందితే తల్లికి వందనం ఇవ్వరని సమాచారం.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్కాలర్ షిప్ పొందుతున్న వాళ్ళు సైతం  ఈ   పథకానికి అనర్హులు అని సమాచారం అందుతోంది. ఈ నిబంధనలు అమ్మఒడి పథకం గతంలో అమలైన సమయంలో  ఉన్న నిబంధనలు కాకపోవడం  గమనార్హం.

అదే సమయంలో రేషన్ కార్డు లేకపోయినా మున్సిపల్ పరిధిలో  1000 చదరపు అడుగుల స్థలం ఉన్నా కారు ఉన్నా  కూడా ఈ పథకానికి అర్హత పొందలేరని తెలుస్తోంది.  విద్యుత్ బిల్లు 300 యూనిట్లు దాటితే  కూడా ఈ పథకానికి అర్హత లేనట్టేనని  తెలుస్తోంది.  మాగాని 3 ఎకరాలు, మెట్ట  10 ఎకరాలు ఉన్నా  ఈ పథకానికి అర్హత లేనట్టేనని సమాచారం అందుతోంది.  ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్  పరిధిలోకి వచ్చే  పిల్లలకు  ఆయా శాఖలు ఇచ్చే మొత్తాన్ని మినహాయించి మిగిలిన మొత్తాన్ని పథకంలో భాగంగా జమ చేయనున్నారు.

సచివాలయాలలో లబ్ధిదారుల జాబితా ప్రదర్శించిన తర్వాత  జాబితాలో ఎవరిపై అయినా ఫిర్యాదు వస్తే  వారికి ఈ పథకాన్ని  ఆపేస్తారని సమాచారం  అందుతోంది.  ఈ పథకానికి సంబంధించి షరతులు  విధించడం విషయంలో ప్రజల నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  జులై నెల 5వ తేదీన ఎంతమంది తల్లుల ఖాతాలలో  ఈ స్కీమ్  నగదు జమవుతుందో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: