ప్రముఖ సీనియర్ జర్నలిస్టుగా పేరుపొందిన కొమ్మినేని శ్రీనివాస్  ఒక డెబిట్ లో భాగంగా అమరావతి మహిళలను కించపరిచే విధంగా మాటలు ఉన్నాయని  పోలీస్ కేసులు నమోదు కావడంతో అరెస్టు చేయడం జరిగింది. ఈ విషయం పైన చాలామంది మహిళలు ధర్నాలు చేయడం ప్రముఖ మీడియా ఛానల్లో ధ్వంసం చేయడం వంటివి చేశారు.. అయితే క్షమాపణలు చెప్పిన కూడా వదలకపోవడంతో  చాలామంది నేతలు, జర్నలిస్టులు కూడా ఏపీ ప్రభుత్వం పైన ఫైర్ అయ్యారు ఇలాంటి సమయంలో సుప్రీంకోర్టులో కొమ్మినేని పిటిషన్ పైన దాకలు చేయగా విచారణ చేపట్టారు దీంతో కోర్టులో కొమ్మినేని కి భారీ ఊరట లభించింది వెంటనే ఆయనను విడుదల చేయాలి అంటూ సుప్రీంకోర్టు కూడా ఆదేశాలను జారీ చేసింది.


వాక్ స్వాతంత్ర్యాన్ని రక్షించాలన్న సుప్రీంకోర్టు నవ్వినంత మాత్రాన అరెస్టు చేస్తారా అంటూ ప్రశ్నించడం జరిగింది అలాగే కేసులో విచారణ సందర్భంగా తెలిపింది సుప్రీంకోర్టు. డిబేట్ లను గౌరవప్రదంగా నిర్వహించాలని వెల్లడించింది. అయితే కొమ్మినేని శ్రీనివాస్ అక్రమ అరెస్టు అంటూ దాకలైన పిటిషన్లు శుక్రవారం ఈరోజున విచారణ చేపట్టింది. పిటీషన్ లో పేర్కొన్న ముఖ్యమైన అంశాల విషయానికే వస్తే..


కొమ్మినేని శ్రీనివాస్ ని అక్రమంగా అరెస్టు చేశారని..

మూడేళ్లలోపు శిక్ష పడేటువంటి నేరాలకు పోలీసులు 41 కింద నోటీసులు ఇవ్వాలని సుప్రీంకోర్టు తెలియజేసింది నోటీసు ఇవ్వకుండానే అక్రమంగా అరెస్టు చేశారని తెలిపారు.

సుప్రీంకోర్టు తీర్పును పోలీసులు అసలు పాటించలేదు. అయితే అలాంటి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయవద్దని నియంత్రించారని కానీ వాటిని సమర్థించలేదని.


తెలంగాణలో అరెస్టు చేసి 331 కిలోమీటర్ల దూరంలో ఉండే ఆంధ్రప్రదేశ్లో రిమాండ్ కు చేర్చడం.

కొమ్మినేని శ్రీనివాస్ ఒక సీనియర్ జర్నలిస్ట్ ఆయనకు ఎలాంటి నేర చరిత్ర కూడా లేదు పైగా సీనియర్ సిటిజన్ 70 ఏళ్ల వయసు వ్యక్తి.

కొమ్మినేని దర్యాప్తుకు సంబంధించి ఆయన తప్పించుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు.

అక్రమ అరెస్టు వల్ల ఆయన జీవించే హక్కుకు భంగం కలిగించారని.


ప్రాథమిక హక్కులు ప్రకారం ఆర్టికల్ 19,21,22(1) ఉల్లంఘించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: