రీసెంట్ గా అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ లో జరిగిన ఎయిర్  ఇండియా విమాన ప్రమాదం ఎంత తీవ్ర విషాదాన్ని మిగిల్చింది అనేది అందరికీ తెలిసిందే . ప్రపంచంలో జరిగిన అత్యంత ప్రమాదకరమైన ప్రమాదాలలో ఈ అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఒకటిగా నిలిచింది . అహ్మదాబాద్ నుంచి లండన్ కు ప్రయాణమైన నిమిషాలల్లోనే  విమానం కుప్పకూలిపోవడం విమానంలో ఉన్న 242 మందిలో 241 మంది అక్కడికే మరణించడం .. ఒక వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడడం సంచలనంగా మారింది . ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడడం కూడా ఒక మిరాకిల్ అంటున్నారు జనాలు.


అయితే ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఘోర విమాన ప్రమాదాలు  ఎన్నెన్నో జరుగుతున్నాయి . వీటికి ఫుల్ స్టాప్ పెట్టడానికి ఉక్రెయిన్ దేశం సరికొత్త టెక్నాలజీని తీసుకొచ్చింది . విమానం కూలిపోయిన ..విమానం ఏదైనా ప్రమాదంలో ఉన్న ప్రయాణికులు పూర్తిగా సురక్షితంగా బయటపడడానికి ఒక కొత్త టెక్నాలజీని కనుగొన్నింది. విమానాలు కూలిన ప్రయాణికులు సురక్షితంగా బయటపడేలా ఒక సాంకేతికతను అభివృద్ధి చేసింది . ప్రస్తుతం దీనికి సంబంధించి ట్రయల్స్  నడుస్తున్నాయి.  విమానంలో ప్రయాణికులు ఉన్న కంటైనర్ ప్రమాద సమయంలో విడిపోయేలా ఒక అత్యాధునిక టెక్నాలజీని తీసుకొచ్చింది.



విమానం కూలిపోయే ముందు సంకేతాలు కనిపించగానే ఒక బటన్ నొక్కితే చాలు ప్రయాణికులు ప్రాణాలు సేఫ్ లో ఉండేలా ఉన్న కంటైనర్ ఇంజన్ నుంచి వేరే అయిపోతుంది. ఈ కంటైనర్ పైన ఉన్న భారీ పారాషూట్ ఓపెన్ అవుతుంది . అంతేకాదు అది సేఫ్గా కంటైనర్ లాండ్ చేస్తుంది. అది భూమ్మీదైనా నీళ్ల మీద అయినా ఎక్కడైనా సరే ల్యాండ్  అయ్యేలా డిజైన్ చేశారు . అంతేకాదు కింద కుషన్స్ కూడా ఆక్టివేట్ అయ్యేలా కొత్త టెక్నాలజీని తీసుకొచ్చారు . దీంతో ప్రయాణికులు సురక్షితంగా ప్రాణాలతో బయటపడతారు . దీనికి సంబంధించిన ఆనిమేటెడ్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్. అయితే నిజంగా ఈ టెక్నాలజీ అమల్లోకి తీసుకు వస్తే మాత్రం విమానా ప్రమాదాలు తగ్గిపోతాయి అంటున్నారు ప్రముఖులు.  కానీ ఇది చాలా భారీ ఖర్చుతో కూడుకున్న పని . ఇలాంటి విమానాలలో ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం డబ్బులు కూడా ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటాయి. ఈ ప్రయోగం విజయవంతం అవ్వాలి అని అందరు కోరుకుంటున్నారు. మన సెంఘ్ట్రల్ గవర్న్మెంట్ కూడా ఈ పద్దథి పై ప్రత్యేకమైన ఫోకస్ పెట్టింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: