అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒకవైపు ప్రకటనల మీద ప్రకటనలు చేస్తూ.. మీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరినీ వెనక్కి పిలిపించమని చెబుతూ వస్తున్నారు. విమానాలు బయలుదేరిన వాటిని వెనక్కి పిలిపించమని చెప్పినప్పటికీ కూడా ఇరాన్ ఇప్పుడు తాజాగా ఇజ్రాయిల్ మీద రెండు మిస్సైల్స్ ని ఉపయోగించింది. దీంతో ఇజ్రాయిల్లో ఉన్నటువంటి రెండు ప్రాంతాలు దెబ్బతిన్నాయి. దాంతో ఆగ్రహించినటువంటి నేతన్యహు యుద్ధ విమానాలను పంపించారు. పంపించగానే వెంటనే వెనక్కి పిలిపించమని ట్రంప్ చెప్పిన కూడా వినలేదు..


అయితే టెహరాన్ మీద మిస్సైల్ ని ప్రయోగించింది ఇజ్రాయిల్. ఉదయం ఇరాన్ దాడికి కౌంటర్ ఇచ్చామంటూ ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ తెలియజేశారు. అదే సందర్భంలో ట్రంప్ మాటనే వాళ్లు వినలేదు కాబట్టే మేము కూడా దానికి తగినట్టుగానే ప్రతీకారం తీర్చుకుంటున్నామంటూ తెలియజేసింది. మరొకవైపున ఎయిర్ డిఫెన్స్ సిస్టం ని ధ్వంసం చేసినటువంటి ఇజ్రాయిల్.. ఇప్పుడు ఇరాన్ లో ఉన్నటువంటి రాడార్ కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే ఆ రాడార్ వ్యవస్థను కూడా ధ్వంసం చేసింది. తాజాగా అందుకు సంబంధించి విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. దీంతో ట్రంప్ కి సైతం కోపం వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.


ప్రత్యేకించి  ట్రంప్ చెప్పినప్పటికీ కూడా  కాల్పుల వివరణ అన్నది ఎవరు పాటించలేదు అటు ఇరాన్, ఇజ్రాయిల్ . కానీ ట్రంప్ మాత్రం స్టేట్మెంట్లు ఇస్తూనే ఉన్నారు.. రెండు దేశాలు కూడా క్షిపని దాడులతో మరొకసారి ఉద్రిక్తత పరిస్థితులు పెరిగాయి. ట్రంప్ ఏమో ఇద్దరి మీదనా తాను సాటిస్ఫాక్షన్ తో లేనని అసంతృప్తితో ఉన్నాననే విషయాన్ని వెల్లడించారు. నేతన్యహు తగ్గాలని చెప్పిన ట్రంప్.. ముందు వాళ్ళని తగ్గమని చెప్పండి అంటూ తెలియజేస్తోంది నేతాన్యాహు. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితి అక్కడ నెలకొనింది. ఉదయం ఇరాన్ దాడికి కౌంటర్ వేశామంటూ తెలియజేస్తున్నారు. మరి ఈ విషయం పైన ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: