సాధారణంగా అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు చిన్నచిన్న తప్పులు చేసినా వారిని టార్గెట్ చేస్తూ కథనాలు ప్రచురితం కావడం అరుదుగా జరుగుతుంది. తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే కుట్రలో ఇరుక్కున్నారా? లేక కుట్రలో ఇరికించారా? అనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబుకు సొంతంగా ఒక కన్ స్ట్రక్షన్ సంస్థ ఉంది. తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటకలో సైతం ఈయన వ్యాపార లావాదేవీలను నిర్వహిస్తున్నారు.

ఎమ్మెల్యేకు సంబంధించిన  కన్  స్ట్రక్షన్ సంస్థ  యూనియన్ బ్యాంక్ నుంచి ఏకంగా 900 కోట్ల రూపాయల  ఋణం తీసుకుంది. అయితే ఆస్తులు తనఖా పెడితే మాత్రమే  ఋణం  మంజూరు అవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు.  ఆస్తులు తనఖా పెట్టని  పక్షంలో బ్యాంక్ నుంచి లోన్ పొందే అవకాశం అయితే లేదని  ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

బ్యాంకులో ఏదైనా ప్రాపర్టీ తనఖా పెట్టాలంటే మొదట స్టాంప్ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది.  తనఖా వివరాలను పొందుపరచి ఈ స్టాంప్ ను పొందాల్సి ఉంటుంది.  రిజిస్ట్రేషన్ ఫీజుతో పాటు యూజర్ చార్జీలను సైతం చెల్లించాల్సి ఉంటుంది.  బ్యాంక్ నుంచి తీసుకునే రుణంలో .5 శాతం స్టాంప్ డ్యూటీగా చెల్లించాల్సి ఉంటుంది.  సాధారణంగా 900 కోట్ల రూపాయల అప్పు తీసుకుంటే  స్టాంప్ డ్యూటీలో  భాగంగా 4.5 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.  

అయితే ఎమ్మెల్యే మాత్రం కేవలం 1,51,700 రూపాయలు చెల్లించి  మిగతా డబ్బులు చెల్లించలేదు.   మిగతా సొమ్మును చెల్లించకుండానే చెల్లించినట్టు చూపించారు.  ఈ వివాదం తాజాగా తెరపైకి రాగా మధ్యవర్తి మోసం చేశారని  ఎమ్మెల్యే చెబుతున్నారు.  మరో సంస్థ నుంచి తీసుకున్న ఋణం  విషయంలో సైతం  ఇలాంటి సమస్య ఉందని భోగట్టా.  అయితే మధ్యవర్తి ఎమ్మెల్యేను, సంస్థను మోసం చేయడం సాధ్యమేనా అనే ప్రశ్నలు తలెత్తుతుండగా  ఈ వివాదం  తిరుగుతుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: