ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తమిళనాడు రాజకీయాలలో ఎలాంటి వార్తలు వినిపిస్తున్నాయి అనేది ప్రెసెంట్ అందరికీ తెలిసిందే. రీసెంట్ గా మధురైలో జరిగిన మురగన్ మానాడు సభకు హాజరైన పవన్ కళ్యాణ్ ఆ సభలో మాట్లాడుతూ అధికార డిఎంకె పార్టీపై విమర్శలు గుప్పించారు . అంతేకాదు ఆయన ఎప్పుడు చెప్పే హిందువుల సనాత ధర్మం అంటూ తన వాదాన్ని మళ్లీ వినిపించారు.  దీంతో తమిళనాడు రాజకీయాలలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ పేరు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.
 

ఆయన మురుగన్ మానాడు సభలో హాజరై మాట్లాడిన మాటలకు కొంతమంది తమిళనాడు రాజకీయ నేతలు గట్టిగా తిప్పి కొట్టారు.  రీసెంట్గా బాహుబలి ఫేమ్ సత్యరాజ్ కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలపై మండిపడ్డారు . "మతం పేరుతో ఓట్లు దండుకోవాలని చూస్తే అస్సలు ఊరుకోం.. అది తమిళనాడులో పనిచేయదు " అంటూ ఘాటుగానే కౌంటర్ వేశారు . పవన్ కళ్యాణ్ మురుగన్ మానాడు సభకు హాజరై ఆ సభలో మాట్లాడుతూ.."నాస్తికులకు ఏ దేవుడు నమ్మాల్సిన అవసరం లేదు అని .. కానీ మన దేశంలో సమస్య ఏమిటంటే.. నాస్తికులు హిందువులను ఎంపిక చేసుకొని మరి టార్గెట్ చేస్తున్నారు " అంటూ విమర్శలు గుప్పించారు.



పవన్ కళ్యాణ్ మతం పేరుతో తమిళనాడులో చిచ్చుపెట్టాలని చూస్తున్నాడు అంటూ ఇప్పటికే పదవులు మంత్రులు ఫైర్ అయ్యారు . తాజాగా స్టార్ నటుడు సత్యరాజ్ కూడా పవన్ కళ్యాణ్ కామెంట్ల పై స్పందిస్తూ.." ఏంటి దేవుడి పేరుతో తమిళనాడులో రాజకీయాలను చేస్తున్నారా..? అలా చేస్తే చూస్తూ ఊరుకోం.  మతం పేరుతో ఓట్లు దండుకోవాలని చూస్తున్నారా..? పెరియర్ సిద్ధాంతాలను నమ్మిన తెలుగు - తమిళ - ప్రజలను మీరు మోసం చేయలేరు . మురుగన్ సభతో మీరు మిమ్మల్ని మోసం చేశారు అనుకుంటే అది మీ తెలివి తక్కువ తనమే అవుతుంది గుర్తుపెట్టుకోండి .. తమిళ ప్రజలు తెలివైన వారు.. తమిళనాడు  ప్రజలని మోసం చేయలేరు అంటూ సత్యరాజ్ - పవన్ కళ్యాణ్ కి స్ట్రైట్ గా వార్నింగ్ ఇచ్చారు. దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ బాగా వైరల్ గా మారింది. అయితే కొంతమంది పవన్ కళ్యాణ్ ని కావాలని టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు . ఏపీ లో  చేసే రాజకీయాలు చేసుకోక.. నీకు ఎందుకు ఈ పెత్తనాలు..?? అంటూ ఘాటుఘాటుగా కౌంటర్స్ వేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: