
అయితే ఆరోజు లోకేష్ మాట్లాడినటువంటి సందర్భంలో.. అధికారులతో మాట్లాడతానన్న నారా లోకేష్ తాజాగా తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి కాబట్టే ఆయన కూడా ఎన్టీఆర్ అభిమానే కాబట్టి.. గతంలో తెలుగుదేశం వ్యక్తే కాబట్టి వెంటనే లోకేష్ చెప్పగానే ఎన్టీఆర్ పార్కుకి సంబంధించి మరమ్మత్తుల పనులను కూడా చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వానికి నారా లోకేష్ ఒక లేఖ ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా లోకేష్ లేఖకు వెంటనే స్పందించారు.
ఎన్టీఆర్ గారి పార్కుకి మరమ్మతులు ప్రారంభించారు సుమారుగా కోటి 35 లక్షల రూపాయల వ్యయంతో hmda ఇప్పుడు అక్కడ పనులను చేస్తోంది.. దీంతో నారా లోకేష్ మాటకు వ్యాల్యూ ఉంది అన్నట్లుగా పలువురు నేతలు కార్యకర్తలు సైతం వైరల్ గా చేస్తున్నారు. ఇప్పటికే ఏపీలో చంద్రబాబు తర్వాత నారా లోకేష్ టిడిపి పార్టీ పగ్గాలు చేపట్టాలనే విధంగా చాలామంది నేతలు మాట్లాడుకుంటున్నారు. మరి రాబోయే ఎన్నికలలో చంద్రబాబు రిటైర్మెంట్ ఇచ్చి తన కుమారుడు నారా లోకేష్ కి పగ్గాలు ఇస్తారేమో చూడాలి.