వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని సుదీర్ఘ కాలం తర్వాత గుడివాడకు రావడం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. మాజీ ఎమ్మెల్యే, వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కొరకు కొడాలి నాని కోర్టుకు హాజరు కావడం జరిగింది. హైకోర్టు దిగువ కోర్టులో బెయిల్ తీసుకోవాలని సూచించిన నేపథ్యంలో ఆయన స్వయంగా వచ్చి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

బెయిల్ కొరకు అవసరమైన హామీ పత్రాలను సైతం  ఆయన సమర్పించారు.  ఈ కేసుకు సంబంధించి 16 మంది  నాని  అనుచరులు  ఇప్పటికే బెయిల్ పై విడుదల కావడం జరిగింది.   కొడాలి నాని చెబితేనే తాము దాడి చేశామని ఇప్పటికే కొంతమంది పోలీస్ స్టేషన్ లో అంగీకరించినట్టు సమాచారం అందుతోంది.  ఏడాది తర్వాత కొడాలి  నాని గుడివాడకు రావడంతో పార్టీ శ్రేణులు సైతం  గుడివాడకు చేరుకొని కొడాలి నానిని కలిశాయి.

కొడాలి నాని  దాదాపుగా ఏడాది పాటు అజ్ఞాతంలో  ఉండి  ఇప్పుడు గుడివాడలో  కనిపించడం  హాట్ టాపిక్ అవుతోంది. వల్లభనేని  వంశీని కలవాలని అనుకున్న సమయంలోనే కొడాలి నాని  గుడివాడకు రావడం జరిగింది.  ఇప్పుడు రావి వెంకటేశ్వరరావు వస్త్ర  దుకాణం వివాదం విషయంలో బెయిల్ కోసం స్వయంగా వచ్చి దరఖాస్తు  చేశారు.  పోలీసుల ఒత్తిడి మేరకు తాము స్టేట్ మెంట్ ఇచ్చామని నాని తరపు అనుచరులు చెప్పినట్టు లాయర్లు  వాదించనున్నారు.

ఈ వివాదం రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు  తిరుగుతుందో అనే కామెంట్లు సైతం   వ్యక్తమవుతూ  ఉండటం గమనార్హం.  కొడాలి నాని నోటి దురుసు వల్లే ఆయనకు ఇలాంటి  పరిస్థితి వచ్చిందని సోషల్ మీడియా  వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.   కొడాలి నాని భవిష్యత్తు  ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. కొడాలి  నానిపై ప్రజల్లో నెగివిటిటీ  మాత్రం ఊహించని స్థాయిలో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: