ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైయస్ షర్మిల గత ఎన్నికల ముందు నుంచే ఎక్కువగా తన సోదరుడు వైసిపి పార్టీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పైన ఎక్కువగా విమర్శలు చేస్తూ ఉన్నది.. వివేక హత్య నుంచి మొదలు తన ఆస్తులు వ్యవహారం వరకు షర్మిల ఎన్నో విషయాలను ప్రస్తావిస్తూనే ఉన్నది. అయితే ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఎక్కువగా టార్గెట్ చేస్తోంది షర్మిల ఇప్పుడు తాజాగా షర్మిల మరొకసారి యూటర్న్ తీసుకొని మరి పలు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఏపీ అంతటా కూడా వైరల్ గా మారుతున్నాయి.


ఇప్పుడు కూడా వైసిపి పార్టీని టార్గెట్ చేస్తూ.. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక మహాసముద్రం లాంటిదని..ఇందులో ఎన్నో పిల్లకాలువలు కూడా కలిసిపోతాయి అంటూ తెలిపింది.ఈ క్రమంలోనే వైసీపీ పేరును కూడా తెలియజేస్తూ మహాసముద్రంలో దేశంలో ఉన్న అన్ని పిల్ల కాలువలు కూడా కలవాల్సిందేనని ఏదో ఒక రోజు వైసీపీ కూడా అదే పని చేస్తుందంటూ వ్యాఖ్యానించింది. గడిచిన నాలుగు రోజులుగా వైఎస్ షర్మిల పర్యటిస్తూ జిల్లాలలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి తన వంతు కృషి చేస్తూనే ఉన్నది.


వాస్తవానికి గత ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎక్కువగా ఈ తరహాలోనే ఏపీలో ఎక్కువగా వార్తలు వినిపించాయి. వైసిపి పార్టీ ఘోరంగా ఓడిపోయిందని జగన్ పరిస్థితి ఏంటి అనే విషయం చర్చనీయాంశంగా మారింది. వైసిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీతో కలిసి ఉన్న ఎన్నికల సమయంలో మాత్రం దూరంగా ఉన్నారు. చివరికి కూటమితో జతకట్టి అధికారాన్ని పంచుకుంది బిజెపి. ఇలాంటి సమయంలో ఇక జగన్ మీద ఉన్న కేసులు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి.. జగన్ రాజకీయంగా రక్షించుకునేందుకు కాంగ్రెస్ పార్టీలో కూటమిలో చేరుతారనే విధంగా చాలామంది విశ్లేషకులు చెప్పుకొచ్చారు. కానీ ఇప్పటివరకు అలాంటి పరిస్థితులేమి కనిపించలేదు. వైసీపీ పార్టీ ఇప్పుడు మళ్లీ పుంజుకోవడంతో షర్మిల ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందని వైసిపి కార్యకర్తలు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: