గత నాలుగైదు రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ టీవీ ఛానల్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య సంఘటన హాట్ టాపిక్ గా మారింది.  స్వేచ్ఛ సూసైడ్ చేసుకోవడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. స్వేచ్ఛ ఆత్మహత్య వెనుక చాలా నిజాలు ఉన్నాయని విషయాలు పోలీసులు కూడా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈమెతో సహజీవనం చేసినటువంటి పూర్ణచంద్ర హస్తం కూడా ఉందని పోలీసులు తెలియజేశారు. అంతేకాకుండా స్వేచ్ఛ కూతుర్ని ఇబ్బందులకు గురి చేసే వారిని.. స్వేచ్చ ని కూడా చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టారు అన్నట్టుగా స్వేచ్ఛ కూతురు ఇటీవలే పోలీసులకు ఫిర్యాదులో తెలియజేసింది.



అయితే ఇప్పుడు తాజాగా పూర్ణచంద్ర భార్య స్వప్న చేసినటువంటి కామెంట్స్ స్వేచ్ఛ ఆత్మహత్యలో మరో ట్విస్టుగా మారనుంది. మరి పూర్ణచంద్ర భార్య స్వప్న ఎలాంటి విషయాలను మాట్లాడిందని విషయానికి వస్తే.. తనకి పూర్ణచంద్ర ద్వారానే స్వేచ్ఛ పరిచయమైందని తెలిపింది స్వప్న. అయితే వీరిద్దరి మధ్య సంబంధం ఏముందని విషయం తనకు తెలియదని వెల్లడించింది. కానీ వీరిద్దరి వ్యవహారం తెలిసిన తర్వాత పూర్ణ నీ పూర్తిగా దూరం పెట్టేసానని తెలియజేసింది. ఇక పూర్ణ చంద్ర పైన స్వేచ్ఛ కూతురు చేసిన ఆరోపణలు అసత్యమని తెలియజేసింది పూర్ణచంద్ర భార్య స్వప్న.


స్వేచ్ఛ కూతురు అరణ్య ను తన సొంత కూతుర్ల చూసుకునే వారంటూ వెల్లడించింది స్వప్న. స్వేచ్ఛ తనని మానసికంగా చాలా టార్చర్ చేసిందని పూర్ణచంద్ర ని కూడా చాలాసార్లు బ్లాక్మెయిల్ చేసిందంటు తెలియజేసింది స్వప్న.. ఎంతలా అంటే నా పిల్లలను కూడా అమ్మ అని పిలుచుకునేలా భయపెట్టేది అంటూ స్వప్న తెలియజేసింది నా భర్త పూర్ణచంద్ర నిర్దోషి, అమాయకుడు అంటూ తెలియజేసింది స్వప్న. మొత్తానికి స్వేచ్ఛ కేసులో పూర్ణచంద్ర భార్య ఎంట్రీ ఇవ్వడంతో ఈ కేసు మరి ఎలా మలుపు తిరుగుతుందో చూడాలి మరి. మరి పోలీసులు ఏం చెబుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: