ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందనే విషయంపై గత కొద్ది రోజులుగా సీనియర్ నేతలు సైతం చాలా ఉత్కంఠంగా ఎదురు చేశారు. నిన్నటి రోజున ఈ పదవికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయగా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతూ ఈరోజు మధ్యాహ్నం వరకు నామినేషన్ల స్వీకరణ జరిగింది. అయితే ఓటింగ్ అర్హత కలిగిన వారు 119 మంది ఉన్నారట. ఈ ఎన్నికలు కర్ణాటక ఎంపీ  పీసీ మోహన్ సమక్షంలో నిర్వహించబోతున్నారు. నామినేషన్ కి సంబంధించి పత్రాలపరిశీలన, స్వీకరణ ,ఉపసంహరణ వంటి ప్రక్రియ ఈరోజు జరిగింది.


అధిష్టానం నిర్ణయం మేరకు కేవలం ఒకరికి మాత్రమే నామినేషన్ దాఖలు చేసే అవకాశం కల్పించింది. ఒకవేళ ఒకరి కంటే ఎక్కువ నామినేషన్ దాఖలు చేస్తే జులై 1వ తేదీన పోలింగ్ నిర్వహించి ఆ తర్వాత బిజెపి ఏపీ అధ్యక్షుడిని ఎంచుకుంటారు. ప్రస్తుతం అయితే ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి వ్యవహరిస్తోంది. ఆమె పదవి కాలం పూర్తి అవుతూ ఉండడంతో ఇమేనే మరొకసారి అధ్యక్ష పదవి నుంచి కొనసాగిస్తారనే ప్రచారం కూడా జరిగింది. కానీ బిజెపి మాత్రం ఈసారి కొత్తవారికి అవకాశాలు అప్పగించేలా ప్లాన్ చేస్తున్నారు.



బిజెపి ఏపీ అధ్యక్ష పదవి కోసం చాలామంది నేతలు పోటీ పడుతున్నారు.ముఖ్యంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి, జీవీఎల్ నరసింహారావు, మాజీ ఎమ్మెల్సీ మాదవ్, విష్ణువర్ధన్ రెడ్డి, సీఎం రమేష్  వంటి వాళ్లు పేర్లు కూడా ఎక్కువగా వినిపించాయి. కానీ పివిఎన్ మాదవ్ పైనే అధిష్టానం ఎక్కువ మక్కువ చూపుతున్నట్లు తెలుస్తోంది. ఆయన పేరునే ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి .దీంతో రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మాదవ్ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. మాదవ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. మాదవ్ ఎవరో కాదు దివంగత నేత పివి చలపతిరావు కుమారుడే.. మొత్తానికి ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి పురందేశ్వరిని తప్పించి కొత్తవారికి అవకాశం కల్పిస్తున్నట్లుగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: