
పాశమైలవరం రియాక్ట్ పేలుడులో మరో 35 మంది. చికిత్స పొందుతున్నారని సంగారెడ్డి కలెక్టర్ వెల్లడించారు ఈ ప్రమాదం జరిగినప్పుడు ఘటన స్థలాలిలో ఉన్నటువంటి 57 మందిని సురక్షితంగా కాపాడి ఇళ్లకు చేర్చామన్నట్లుగా తెలియజేశారు.అంతేకాకుండా వైద్యులు మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు వివరించారట. అయితే ఈ పేలుడు సంభవించిన సమయంలో ఫ్యాక్టరీలో 18 మంది కార్మికులు ఉన్నారని తెలుస్తోంది. అయితే ఈ పేలుడులోనే కంపెనీ వైస్ ప్రెసిడెంట్ అయిన గోవన్ సైతం మృతి చెందినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
దీంతో తెలంగాణ ప్రభుత్వం ఇక మీదట పరిశ్రమలలో కూడా భద్రత పైన త్వరలోనే ఒక కమిటీ వేసి పలు రకాల చర్యలు తీసుకుంటామని కార్మికులకు కూడా ఎక్కువ పని ఒత్తిడి చేయకుండా చేసేలా నిర్ణయాలు తీసుకుంటామంటూ తెలంగాణ ప్రభుత్వం తెలియజేస్తోంది. అయితే ఈ పేలుడికి గల కారణాలు ఇప్పుడే ఏమి చెప్పలేమని తెలియజేస్తున్నారు. ఈ కంపెనీలో మైక్రో క్రిస్టలైన్ సెల్యూలోజ్ అనే పౌడర్ తయారవుతుందట. సుమారుగా 40 ఏళ్లుగా ఈ సంస్థ పని చేస్తూ ఉన్నదని సమాచారం. ఈ పేలుడు సంఘటన తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతూ ప్రభుత్వం అన్ని విధాలుగా వారి కుటుంబాలకు అండగా ఉంటుందంటూ ప్రకటించారు.. శిధిలాలు తొలగిస్తున్న కొద్ది శవాలు బయటపడుతున్నట్లుగా అధికారులు తెలియజేస్తున్నారు..ఈ మృతదేహాలు గుర్తుపట్టాలి అంటే డిఎన్ఏ పరీక్షలు ఒక్కటే మార్గం అంటూ అక్కడ వైద్యులు కూడా తెలుపుతున్నారు.