
ఈ రోజున ఆ సహాయాన్ని అందించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండు లక్షల రూపాయలను ఆర్థిక సహాయంగా ప్రకటిస్తూ మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ప్రభుత్వ విప్ హరిప్రసాద్, గిడ్డి సత్యనారాయణలు నటి పాకీజాకు ఈ డబ్బుని అందించారు. ఈ సందర్భంగా పాకీజా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చిన్నవాడైన ఎదురుగా ఉంటే కాళ్లు మొక్కేదాన్ని అంటూ చాలా ఎమోషనల్ గా మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
తన ఆర్థిక పరిస్థితి గురించి నిన్ననే పవన్ కళ్యాణ్ కార్యాలయానికి తెలియజేశానని తక్షణమే సహాయం అందించడంతో ఆనందంగా ఉందని పవన్ కళ్యాణ్ కు జీవితాంతం రుణపడి ఉంటాను అంటూ తెలియజేసింది. నటి పాకీజా నటించిన చిత్రాల విషయానికి వస్తే అసెంబ్లీ రౌడీ, చిట్టెమ్మ మొగుడు ,పెదరాయుడు, అమ్మ రాజీనామా తదితర చిత్రాలలో తెలుగులో నటించింది. ఇక అలాగే తమిళంలో అనేకాకుండా ఇతర భాషలలో కూడా సుమారుగా 200లకు పైగా చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించినట్లు సమాచారం. ఈమె అసలు పేరు వాసుకి అయినప్పటికీ కూడా పాకీజా పేరుతో తెలుగులో బాగా పేరు సంపాదించింది. గత కొన్నేళ్లుగా ఏమి దిగిన స్థితిలో బ్రతుకుతోందని ఎన్నో రకాల వీడియో ఇంటర్వ్యూలలో కూడా వెల్లడించింది పాకేజా. మొత్తానికి పవన్ కళ్యాణ్ ఆర్థిక సహాయం తో పాకీజా ఆనందపడుతోంది.