బిజెపి పార్టీలో ఫైర్ బ్రాండ్ గా పేరు పొందిన విశాఖ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఎప్పుడూ కూడా ఉన్నది ఉన్నట్టుగానే చెప్పేస్తూ ఉంటారు. అధికార పార్టీనా ప్రతిపక్ష పార్టీనా అనే విషయాన్ని చూసుకోరు.  గతంలో చంద్రబాబుని పొగిడిన సందర్భాలు కూడా ఉన్నాయి.. అయితే ఇప్పుడు కూటమిలో ఉన్నప్పటికీ కూడా టిడిపి పార్టీని మరొకసారి నిలదీస్తూ తనని తాను నిరూపించుకుంటున్నారు విష్ణుకుమార్ రాజు. ఇప్పుడు తాజాగా ఈ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు కూటమిలో కొత్త మంటలు పుట్టించేలా కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో టిడిపి కూటమి అధికారంలోకి రావడానికి కేవలం అది బిజెపి పుణ్యమే అంటూ చెప్పుకొచ్చారు.


ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రెసిడెంట్గా పివిఎన్ మాధవన్ ఎంపికైన తర్వాత జరిగిన సభలో ఈయన మాట్లాడడం జరిగింది. కూటమిలో మూడు పార్టీలకు సమానంగా అవకాశాలు రావాలని ఒక కొత్త పాయింట్ ని తెర మీదకి తీసుకోవచ్చారు. కూటమిలో బిజెపి అనేది లేకపోతే అసలు టిడిపి పార్టీకి అధికారమే లేదని.. కేంద్రంలో అధికారం ఉండడం వల్లే అన్ని విధాలుగా ఆంధ్రప్రదేశ్ కూటమికి కలిసి వచ్చిందని విషయాన్ని తెలిపారు. పదవుల విషయానికి వస్తే టీడీపీ పార్టీకి 80 %శాతం జనసేనకు 15% బిజెపికి 5% శాతమేనా అంటూ తీవ్ర అసంతృప్తి తెలిపారు.


ఇది ఎక్కడి అన్యాయం అంటూ ఆయన ఫైర్ అయ్యారు. కేవలం 5% శాతం పదవుల కోసమే కూటమి కట్టిందా అంటూ అసహనాన్ని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో బిజెపి కూటమిలో సమానంగా అన్ని జరగాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే విష్ణుకుమార్ లేవనెత్తిన ఈ అంశంలో చూసుకుంటే 20 మంది మంత్రులు టిడిపికి ఉండగా అలాగే 15% లో 3 మంత్రులు జనసేన పార్టీకి ఉండగా 5 శాతం అంటే ఒకే ఒక్క పదవికి బిజెపి నేత ఉన్నారు. 2014లో నలుగురు ఎమ్మెల్యేలు ఉంటే ఇద్దరికి మాత్రమే ఇచ్చారు. కానీ ఈసారి 8 మంది ఉంటే ఒకరికి మాత్రమే మంత్రిగా అవకాశం ఇచ్చారంటూ ఫైర్ అయ్యారు. మరి సీఎం చంద్రబాబు ఈ విషయంపై ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: