
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చాలామంది వైసిపి నేతలను టార్గెట్ చేశారు అందులో భాగంగానే వల్లభనేని వంశీనీ టార్గెట్ చేస్తూ వరుస పెట్టి వారిని వారెంట్ల పేరుతో ఊపిరాడనివ్వకుండా చేశారు. ఇక జైలుకు వెళ్లి మరి వంశీని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఆ సమయంలో కూడా వంశీ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం అంటూ తెలిపారు. ఎట్టకేలకు వంశి న్యాయపోరాటం చివరికి ఫలించింది.
ఎలాగైనా రెండు మూడు కేసులలో బెయిల్ రద్దు చేయాలని కూటమి ప్రభుత్వం సుప్రీంకోర్టులో ప్రయత్నాలు చేసిన ఫలించలేదు. అన్ని అడ్డంకులను అధిగమించి నిన్నటి రోజున విజయవాడ జైలు నుంచి వంశి బయటికి వచ్చారు.ఈ రోజున వంశీ ఆయన భార్య పంకజశ్రీ కలిసి జగన్ మోహన్ రెడ్డి నీ కలవడం జరిగింది. ముఖ్యంగా జగన్ తో కేసుకు సంబంధించి విషయాలు జైలు జీవితం భవిష్యత్తు రాజకీయాల పైన చర్చించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కొద్దిరోజుల తర్వాత గన్నవరంలో రాజకీయాల పైన యాక్టివ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏ మేరకు వంశీ ఎటువైపుగా అడుగులు వేస్తారో చూడాలి.