
ప్రముఖ టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మాస్క్ తాజాగా అగ్రరాజ్యమైన అమెరికాలో ఒక కొత్త పార్టీని స్థాపించబోతున్నట్లు ప్రకటించారు. ఇందుకు" అమెరికా పార్టీ" అని పేరు పెట్టే అవకాశం ఉందనే విధంగా ఆయన వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో విభేదాలు ఉన్న నేపథ్యంలో ఈ ప్రకటనలు చేయడం మరింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎలన్ మాస్క్ తన ట్విట్టర్లో ఒక పోల్ ను సైతం నిర్వహించి.. తన 22 కోట్ల మంది ఫాలోవర్స్ ని ఒక ప్రశ్న అడగడం జరిగింది. అమెరికాలో కొత్త పార్టీని నెలకొల్పాల్సిన సమయం వచ్చిందా? అని ప్రశ్నించగా అందుకు 80 శాతం మంది అవుననే సమాధానాన్ని వెల్లడించారు.
ఆ విషయాన్ని ఎలన్ మాస్క్ తెలియజేస్తూ ఒక ప్రకటనలో అమెరికాలో 80 శాతం మంది ప్రాతినిధ్యం వహించేటువంటి ఒక కొత్త పార్టీ అవసరం అంటు వెల్లడించారు. అయితే ఈ పార్టీ ప్రధాన పార్టీలైన డెమొక్రటిక్, రిపబ్లిక్ అండ్ పార్టీలకు ప్రత్యాయంగా ఉంటుందనే విధంగా ఎలన్ మాస్క్ వివరించారు. కొత్త పార్టీ సహాయంతోనే 2026 లో మభ్యంతర ఎన్నికలలో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ఈసారి వచ్చే ఎన్నికలలో అమెరికా అధ్యక్ష పదవి కోసం మాస్క్ కూడా పోటీ చేయబోతున్నారు. గత కొన్నేళ్లుగా అమెరికాలో డెమొక్రటిక్, రిపబ్లిక్ ఆన్ పార్టీలు మాత్రమే కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పుడు మరి ఎలన్ మాస్క్ స్థాపిస్తున్న అమెరికా పార్టీ ఎలా నిలబడుతుందో చూడాలి.