
రైతులు ప్రస్తుతం డీలర్లపై ఆధారపడగా వ్యాపారాలు కృత్రిమ కొరత సృష్టిస్తూ అవసరం లేని ఎరువులను రైతులకు అంటగడుతున్నారు. కేంద్రం కేటాయించిన ఎరువులను మార్క్ ఫెడ్ ద్వారా 60 శాతం, ప్రైవేట్ డీలర్ల ద్వారా 40 శాతం విక్రయాలు చేపట్టాల్సి ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 97 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. కర్నూలుకు 150 మెట్రిక్ టన్నులు, నంద్యాలకు 169 మెట్రిక్ టన్నులు కేటాయించారు.
పీఏసీఎస్ లు విక్రయించే ఎరువుల లెక్కలు తేలడం లేదని తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాకు ఎంతమేర ఎరువులు వచ్చాయనే లెక్కలు తేలడం లేదు. నంద్యాల జిల్లాకు మూడు రోజుల క్రితం ఒక వ్యాగిన్ ఎరువులు రాగా ఆ ఎరువులు ఒక్క రోజులోనే అయిపోయాయని అధికారులు చెప్పడం గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బహిరంగ విపణిలో యూరియా, డీఏపీలను సాధారణ ధరతో పోల్చి చూస్తే ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. వ్యాపారాలు యూరియాను 360 రూపాయల నుంచి 400 రూపాయల వరకు విక్రయిస్తూ ఉండటం హాట్ టాపిక్ అవుతోంది. కర్నూలు జిల్లాలోని చాలా ప్రాంతాల్లో యూరియా దందా కొనసాగుతోందని సమాచారం అందుతోంది. వ్యాపారాలు కొన్ని చోట్ల యూరియా లేదు అనే బోర్డులను ప్రదర్శిస్తూ ఉండటం గమనార్హం.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు