
ఉచిత బస్సు పథకం అమలు కోసం ఎలాంటి ప్రకటన ఇప్పటివరకు చేయలేదు. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ ,ఢిల్లీ వంటి ప్రాంతాలలో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలవుతోంది. ముఖ్యంగా తెలంగాణ కర్ణాటకలో ఉచిత బస్సు పైన మిశ్రమంగానే స్పందన లభించింది. ఉచితమనగానే అవసరం లేని ప్రయాణాలు కూడా ఎక్కువ అవ్వడంతో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. కర్ణాటకలో అయితే అధికార ప్రభుత్వ నేతలే ఫ్రీ బస్ అనేది ఉపయోగం లేదని రద్దు చేయడమే మంచిదంటు చెప్పడం పెద్ద ఎత్తున దారితీసింది.
చెన్నై వంటి ప్రాంతాలలో ఉచిత బస్సుల వల్ల మహిళలకు కొంత మేరకు లాభం కలిగిందనే విధంగా అక్కడి నేతలు తెలుపుతున్నారా. దీంతో ఏపీలో కూడా ఉచిత బస్సు పథకం అమలుపైన మార్గదర్శకాలు తయారు చేస్తున్నారట. ప్రస్తుతం ఉన్న బస్సులతో సిబ్బందితో ఈ ఉచిత బస్సు ప్రయాణం అన్నది చేయడం చాలా సాధ్యమైనది కాదని తెలుపుతున్నారు.. ఆర్టీసీలో సగటున 40 నుంచి 45 లక్షల మంది ప్రయాణిస్తూ ఉన్నారట. ఇందులో సగం మంది మహిళలు ఉంటారని ఒకవేళ ఫ్రీ బస్ పెడితే రెండు నుంచి మూడు రెట్లు పెరిగే అవకాశం ఉంటుందట. తెలంగాణ, కర్ణాటక వంటి ప్రాంతాలలో ఈ పథకం వల్ల ఆక్యుపెన్సి బాగానే పెరిగిన మరి ఏపీలో ఉచిత బస్సు పథకం సమస్యలు లేకుండా అమలు కావాలంటే మాత్రం కొన్ని చర్యలు తీసుకోవాలి.
ముఖ్యంగా మూడు వేల కొత్త బస్సులు 10000 మంది సిబ్బందిని నియమించాల్సిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం కూడా 700 విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టేయడం ప్లాన్ చేస్తోంది. మరి ఈ బస్సులలో ఉచిత ప్రయాణానికి అనుమతి ఇస్తారా లేదా అనే విషయం తెలియాలి.