
ఎన్డీఏ కూటమిలో టిడిపి కీలక పాత్ర పోషిస్తుంది .. ఇక త్వరలోనే కేంద్ర ప్రభుత్వం కొత్త గవర్నర్ల నియామకం చేపట్టేందుకు రెడీ అయింది .. ఈ మేరకు ఇప్పటికే కసరత్తు కూడా మొదలుపెట్టింది .. బీహార్ తో పాటుగా త్వరలోనే మరో మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి . ఇక దాంతో పార్టీలో జాతీయ అధ్యక్షుడు మొదలు అన్ని నియామకాలు విషయంలో బిజెపి ఎంతో వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటుంది .. అలాగే తమ మిత్రపక్షాలకు సైతం గవర్నర్లు కేంద్ర మంత్రివర్గ విస్తరణలో అధిక ఇంపార్టెన్స్ ఇవ్వాలని కూడా చూస్తుంది . ప్రధానంగా 2014 - 19 కాలంలోని టిడిపికి గవర్నర్ పదవిపై బీజేపీ హామీ ఇచ్చింది .. అయితే ఆ సమయంలో జరిగిన రాజకీయ పరిణామాలతో టిడిపి ఎన్డిఏ నుంచి బయటికి వచ్చేసిన తర్వాత ఆ నిర్ణయం అమలు కాలేదు.
ఇక ఇప్పుడు గతంలో ఇచ్చిన హామీని ఇప్పుడు నెరవేచ్చేందుకు బీజేపీ అధినాయకత్వం రెడీ అయింది .. ఇప్పటికే గవర్నర్ పదవి పై టిడిపికి కీలక సంకేతాలు కేంద్రం అందించింది .. అలాగే టిడిపి నుంచి పేరు సూచించాలని చంద్రబాబును కోరినట్లు కూడా తెలుస్తుంది .. ఇక టిడిపి నుంచి ఎవరికి చంద్రబాబు గవర్నర్ గా సూచిస్తారని పార్టీలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది . ప్రధానంగా టిడిపి నుంచి ఇద్దరు పేర్లు ప్రముఖంగా రేస్ లో ఉన్నట్టు తెలుస్తుంది .. ఈ రీసు లో ఉన్న నాయకులు ఎవరంటే అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు ఉన్నట్లు తెలుస్తుంది .. ఈ ఇద్దరిలో ఒకరి పేరును చంద్రబాబు గవర్నర్ గా ఎంపిక చేసే ఛాన్స్ ఉంది . అశోక్ గజపతిరాజు , యనమల మొదటి నుంచి టిడిపిలో ఎంతో కీలకంగా ఉన్నారు .. ప్రధానంగా చంద్రబాబుకు తోడుగా ఉంటూ వస్తున్నారు .. ఈ ఇద్దరు అసెంబ్లీ స్పీకర్లుగా , ఆర్థిక మంత్రులుగా కూడా చేశారు అలాగే అశోక్ గజపతిరాజు కేంద్రంలో మంత్రిగా కూడా పనిచేశారు .. ప్రస్తుతం ఈ ఇద్దరికి డప్రభుత్వంలో ఎలాంటి ప్రాధాన్యత లేదు.
అయితే అశోక్ గజపతిరాజు , యనమల వారసులు మాత్రం టిడిపి ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు .. అలాగే ఈ మధ్యనే యనమల మండలి సభ్యుడుగా పదవి విరమణ కూడా చేశారు .. ఆ సమయంలో తనకు రాజ్యసభకు అవకాశం ఇస్తే కొనసాగుతానని లేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కూడా యనమట ప్రకటించారు . అయితే ఇప్పుడు అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పదవి ఇస్తే యనమలకు రాజ్యసభ ఇచ్చే అవకాశం ఉందని పార్టీ నేతలు అంచన వేస్తున్నారు .. అలాగే గత పది సంవత్సరాల్లో మన తెలుగు రాష్ట్రాల నుంచి గవర్నర్గా వెళ్ళింది కేవలం నలుగురు మాత్రమే .. ఇక మరి బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయంతో టిడిపి నుంచి ప్రధానంగా అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పదవికి అవకాశం ఖాయమైందని అంటున్నారు .. త్వరలోనే దీని పై చంద్రబాబు , కేంద్ర ప్రభుత్వం గజిట్ విడుదల చేయబోతుంది .