వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తోతాపురి మామిడి మద్దతు ధర విషయంలో నిర్వహించిన భారీ ఈవెంట్ ఊహించినంత ప్రభావాన్ని చూపలేకపోయింది. స్క్రిప్ట్ ప్రకారం అన్ని అంకాలు జరిపినప్పటికీ , ప్రజల్లో ఇది పూర్తి డ్రామాగా మారిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. జగన్ రాకకు ముందు నుంచే ఇదంతా సజావుగా జరిగేలా మినిట్‌ టు మినిట్ ప్లాన్ తయారు చేశారు , కానీ చివరికి అది నాటకీయంగా మారిపోయింది. ఈవెంట్‌కు ముందే తోతాపురి మామిడికాయలను మార్కెట్ యార్డ్ నుంచి రోడ్డు పైకి తీసుకు వచ్చి పడేయడం, వాటిని లారీలు, ట్రాక్టర్లు తొక్కడం, రైతుల నష్టాన్ని హైలైట్ చేయడం అన్నీ పక్కా స్కెచ్ ప్రకారం జరిగాయి .
 

అయితే ఇప్పుడు దీనిపై పలువురు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు - రైతుల బాధ కంటే రాజకీయ ప్రయోజనం ఎక్కువగా ఉన్నట్టు కనిపించిందని విమర్శలు వస్తున్నాయి. జగన్ రాకకు ముందే కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు నినాదాలు చేస్తూ పోలీసులను బెదిరించారు. "రప్పా రప్పా నరకుతాం" అనే స్థాయిలో పోలీసులు అణగదొక్కే ప్రయత్నాలు చేశారు. తర్వాత జగన్ వచ్చారు. పోలీసులు ఇచ్చిన అనుమతిని వారు పట్టించుకోలేదు .. జగన్ పర్యటనకు వచ్చిన కార్యకర్తలు భారీ సంఖ్యలో వచ్చారు. కానీ మేనేజ్‌మెంట్ లోపంతో సమావేశ స్థలంలో తోపులాటలు జరిగాయి. కార్యకర్తలు ఒకరినొకరు తోసుకోవడం , కొందరు భయంతో వెనక్కి వెళ్లిపోవడం, మొత్తం మార్కెట్ యార్డ్ స్థలాన్ని గందరగోళంగా మార్చేసింది .. జగన్ ప్రసంగంలో తోతాపురి మామిడి మద్దతు ధరలు తమ పాలనలో తిరుగులేని విధంగా అందాయని చెప్పుకుని .. ప్రత్యర్థులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.



 కానీ వాటికన్నా ఆయన మాటల వెనుక రాజకీయ లక్ష్యమే ఎక్కువగా కనిపించిందని విమర్శకుల అభిప్రాయం. ఈ పర్యటనలో మరో వివాదం చోటుచేసుకుంది. ప్రముఖ మీడియా సంస్థ ఆంధ్రజ్యోతి కి చెందిన ఫోటోగ్రాఫర్‌పై కొంతమంది దాడి చేశారు. ఈ ఘటన మీడియా వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. దీనిపై పోలీసుల దృష్టి సారించి విచారణ ప్రారంభించారని సమాచారం. ఈ ఈవెంట్ కోసం పలువురు నేతలు, ముఖ్యంగా భూమన క్యాంప్ భారీగా ఖర్చు పెట్టినప్పటికీ, సాధించాల్సిన ప్రచార ప్రభావం రాలేదనే అసంతృప్తి వినిపిస్తోంది. స్క్రిప్టెడ్ డ్రామా లాగా ఈ ఈవెంట్ గా ప్రజలు భావించడమే ఇందుకు కారణమని రాజకీయ విశేషాలు అంటున్నారు ..

మరింత సమాచారం తెలుసుకోండి: