
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏపీ, తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆదాయం తగ్గిందనే సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు రాష్ట్ర ఆదాయం పెరగడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మాత్రం చాలా వరకు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మద్యం ద్వారా ఆదాయం పెంచుకునే విషయంలో సక్సెస్ అవుతోందని చెప్పడంలో సందేహం లేదు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మద్యం దుకాణాల ద్వారా ఊహించని స్థాయిలో లాభాలు సాధిస్తోంది. రాష్ట్రంలో బెల్ట్ షాపుల సంఖ్య ఊహించని రీతిలో పెరిగిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నా ప్రభుత్వం మద్యం ద్వారా లాభాలను అంచనాలను మించి అందుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సైతం ఈ విషయంలో సక్సెస్ అవుతుండటం గమనార్హం. కూటమి అనుకూల మీడియా సైతం ఈ విషయంలో నచ్చిన విధంగా ప్రచారం చేయడం గమనార్హం.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా చంద్రబాబు ప్రభుత్వం ఉన్న సమయంలో మరో విధంగా వ్యవహరిస్తూ ఉండటం సంచలనం అవుతోంది. ఆంధ్రప్రదేశ్ లో మద్యం అమ్మకాల విషయంలో రికార్డులు బద్దలు అవుతున్నాయని కామెంట్లు వస్తున్నాయి. అయితే కూటమి నేతలు, అనుకూల మీడియా మాత్రం ఇది రికార్డ్ అనుకునే విధంగా ప్రచారం చేసుకుంటూ ఉండటం హాట్ టాపిక్ అవుతోంది.
మద్యం అమ్మకాల వల్ల ఆంధ్రప్రదేశ్ ఆదాయం భారీగా పెరిగిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కూటమి సర్కార్ భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోందో చూడాల్సి ఉంది. అయితే ఏపీ సర్కార్ నాణ్యమైన మద్యం పంపిణీ చేస్తున్నామని చెబుతున్నా మద్యం అలవాటును మాత్రం అరికట్టే దిశగా అడుగులు పడితే బాగుంటుందని చెప్పవచ్చు. ఏపీ సర్కార్ ఒకింత తెలివిగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు