ఈనెల 24న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా అబోవ్ యావరేజ్ గా నిలిచింది. అంతేకాకుండా రాజకీయ పరిస్థితుల వల్ల ఎక్కువగా నెగిటివిటీ ప్రచారం కొనసాగుతోంది. పవన్ కళ్యాణ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా హాజరయ్యారు. ఈ సినిమా విడుదలైన తర్వాత కొన్ని మీడియా వ్యతిరేకత చానెల్స్ సోషల్ మీడియాలో కూడా సినిమా బాగాలేదంటూ ప్రచారం జరుగుతోంది. ఈ విషయం పైన జనసేన శ్రేణులు సోషల్ మీడియా ద్వారా తిప్పి కొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.


అయితే ఇప్పుడు తాజాగా జనసేన పార్టీ మంత్రి  నాదెండ్ల మనోహర్  కార్యకర్తలతో మాట్లాడినట్లుగా సోషల్ మీడియాలో ఒక ఆడియో వైరల్ గా మారుతున్నది. హరిహర వీరమల్లు సినిమాని జనసేన ఎమ్మెల్యేలతో పాటు మరికొంతమంది నేతలు ప్రెస్ మీట్ లు పెట్టి ఈ సినిమాని సక్సెస్ చేయాలి అంటూ పిలుపునివ్వడం జరిగింది. అందుకోసం కొన్నిచోట్ల ఆలయాలకు పూజలు కూడా చేశారు. అయితే సినిమా గ్రాఫిక్స్ డిజైన్ లోపం వల్ల అటు జనసైనికులే ఈ సినిమాపై మండిపడ్డారు. ఇవన్నీ కూడా పవన్ యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాకి మరింత బలాన్ని చేకూర్చాయి.


ఈ విషయంలో జరుగుతున్న ఈ విష ప్రచారానికి సైతం జనసేన పార్టీ మంత్రి నాదెండ్ల మనోహర్ రంగంలోకి దిగి. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులతో టెలికాన్ఫెరెన్స్ లో మాట్లాడుతూ హరిహర వీరమల్లు సినిమా విజయవంతంగా చేయవలసిన బాధ్యత మన అందరికీ ఉందని అందుకోసం పార్టీ శ్రేణులు కూడా కృషి చేయాలని ప్రతి ఒక్కరు సినిమా చూడాలని అందరికీ చూపించాలంటూ తెలిపారు. ఒకవేళ అవసరము అయితే కూటమి పార్టీ నుంచి కూడా సహాయం తీసుకోవాలంటు మంత్రి నాదెండ్ల మనోహర్ సూచనలు ఇచ్చినట్లుగా ఈ ఆడియోలో వైరల్ గా మారుతోంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ మొత్తానికి ఈ ఆడియో సంచలనంగా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: