జేడీ లక్ష్మీనారాయణ.. సిబిఐ జేడీ గా పనిచేసిన అధికారిగా పాపులారిటీ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆ రోజుల్లో భారీ పేరు సంపాదించారు. అయితే కొన్ని కారణాల చేత మధ్యలోనే ఉద్యోగం వదిలేసి రాజకీయాలలోకి వచ్చారు. అసలు జనసేన పార్టీలోకి ఎందుకు చేరారు మళ్లీ పార్టీని ఎందుకు వదిలేశారు అనే విషయం ఇప్పటికి జనసేన నేతలకు, కార్యకర్తలకు అర్థం కావడం లేదు తాజాగా ఒక టీవీ ఛానల్ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న జేడీ.లక్ష్మీనారాయణ అందుకు సంబంధించి సమాధానాలను తెలిపారు.


జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తను పొలిటికల్ గా ఎంట్రీ ఇచ్చింది ఉత్తమ సమాజం కోసం, మంచి ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసమే అంటూ తెలిపారు. అయితే తన సర్వీస్ ఎంతో ఉన్నప్పటికీ పదవి రాజీనామా చేసి మరి బయటికి వచ్చానని.. ఆ సమయంలోనే పవన్ కళ్యాణ్ సినిమాలు వదిలేసి సొంత పార్టీ పెట్టారని ఇద్దరి లక్ష్యం కూడా ఒక్కటేలా కనిపించింది.అందుకే చేయి కలిపానని తెలిపారు. 2019లో పార్టీ ఓడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి తిరిగి వెళ్లడం తనకి నచ్చలేదని అందుకే జనసేన పార్టీకి దూరమయ్యానని తెలిపారు.


రాజకీయాలలో పూర్తిగా ఉంటేనే ఎవరికైనా సీరియస్ నెస్ వస్తుందని అది తన భావనగా తెలిపారు జేడీ లక్ష్మీనారాయణ.. 2024 ఎన్నికలలో జనసేన ,బిజెపి, టిడిపి పార్టీలు కలిసి పోటీ చేశాయి.. జనసేన పార్టీకి 21 అసెంబ్లీ సీట్లు రెండు ఎంపీ సీట్లు రాగా.. ఆ సమయంలో జేడీ కనుక పార్టీలో ఉంటే ఎంపీ అయ్యే వారు కదా అంటూ యాంకర్ ప్రశ్నించగా.. అందుకు జేడీ లక్ష్మీనారాయణ ఇలా మాట్లాడుతూ.. అధికారంలో లేకపోనందుకు తనకు ఎలాంటి బాధ లేదని ప్రజల సమస్యలు పరిష్కారం కావాలన్నదే తన ఆలోచన అంటూ తెలిపారు. అందుకే తాను జై భారత్ పార్టీని కూడా స్థాపించి అందుకు తగ్గట్టుగా పోరాటం చేశానని తలిపారు.


2024ఎన్నికలలో  గత ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వం ఎక్కువ పథకాలు ఇస్తుందని చెప్పింది.ఆలాగే మూడు పార్టీలు కలవడం బలం చేకూరింది.. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది వైసిపి పార్టీ మీద చాలా దెబ్బేసింది.. వీటన్నిటిని జనాలు గుర్తించారని తెలిపారు.అందుకే అంత విజయాన్ని అందుకుందని తెలిపారు. అయితే ఈవీఎంల పైన సందేహాలు ఉన్నాయని చెబుతున్నారు వాటన్నిటిని తీర్చాల్సిన బాధ్యత కూడా ఈసీకి ఉందంటూ తెలిపారు జేడీ.

మరింత సమాచారం తెలుసుకోండి: