30 సంవత్సరాల తర్వాత పులివెందుల గడ్డపై స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుంటే ప్రజలందరూ స్వేచ్ఛ వాయువులతో నిర్భయంగా ఓట్లు వేయడానికి తండోపతండాలుగా వచ్చి వారికి భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకుంటే తన నియంత సామ్రాజ్యం కూలిపోతుందనే భయంతో, అక్కస్సుతో జగన్మోహన్ రెడ్డి నేడు మీడియా సమావేశం నిర్వహించి అవాకులు చవాకులు పేలుతున్నాడని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు అన్నారు. ఈ సందర్భంగా పత్రికా ప్రకటన విడుదల చేసిన ఆయన మాట్లాడుతూ దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటుందని ప్రజాస్వామ్య వ్యవస్థ పై జగన్ మాట్లాడుతుంటే ఆయన పరిపాలన కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న వేళ కనీసం ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు నామినేషన్ను కూడా దాఖలు చేయలేని పరిస్థితులు కల్పించి నామినేషన్ పత్రాలను లాక్కుని చించి వేసి వారిపై దౌర్జన్యాలు చేసిన నీచపు చరిత్ర జగన్మోహన్ రెడ్డిది అని ఈ సందర్భంగా తెలియజేశారు.


ఇంతవరకు గడిచిన 30 సంవత్సరాల కాలంలో పులివెందులలో జడ్పిటిసి ఎన్నికనేది జరగకుండా ఒక నియంత పాలనతో అక్కడ వైఎస్ కుటుంబం ప్రజలను బానిసలను చేసి ఆడుకున్నారని నేడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చినటువంటి ఉప ఎన్నికల్లో 11 మంది అభ్యర్థులు వారి యొక్క నామినేషన్లు దాఖలు చేసి ప్రజాస్వామ్య వ్యవస్థకు గౌరవాన్ని తెచ్చారని ఈ సందర్భంగా తెలిపారు. ఎక్కడ కూడా గమనించవలసిన విషయం ఏమిటంటే వారికి వచ్చిన సీట్ల సంఖ్య అక్కడేసిన నామినేషన్ల సంఖ్య కూడా అని ఆయన హేళన చేశారు ప్రజాస్వామ్యం వ్యవస్థలో ఉన్నప్పుడు వ్యవస్థలను ముఖ్యంగా ఎన్నికలను గౌరవించాలని కానీ కనీసం ప్రతిపక్ష స్థానం కూడా లేని జగన్మోహన్ రెడ్డి 164 సీట్లతో అత్యంత శక్తివంతమైన ప్రభుత్వాన్ని నడుపుతున్న తన తండ్రి సమకాలీకుడిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును వచ్చే ఎన్నికలో ఉండరని, ఇవే చివరి ఎన్నికలని కృష్ణా రామా అనుకుంటూ కూర్చోమని మాట్లాడడం వ్యక్తులు పట్ల వ్యవస్థల పట్ల అతనికున్న అసూయ భావం నియంత్రత్వం తెలియజేస్తున్నాయి అన్నారు.


ముఖ్యమంత్రిని కనీస గౌరవం లేకుండా మాట్లాడడం జగన్ కి తగదని హితవు పలికారు. రేపు నిర్వహించే ఎన్నికల ఫలితాల్లో కూటమి అభ్యర్థులు విజయదుందుభి మోగించడం ఖాయం ప్రజాస్వామ్య జెండాను రెపరెపలాడించడం ఖాయమని ఇప్పటికే రాష్ట్రమంతా నియంతను తుంగలా తొక్కి 11 కి మిగిల్చారని రేపు తన కుంభస్థలాన్ని కూడా పొట్టబోతున్నారని శేషు జోస్యం చెప్పారు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు కనీస బాధ్యతతో మాట్లాడడం గౌరవం అని అది మీరు మాట్లాడితే దానికి తగినట్లుగా పర్యవసనాలు ఎదుర్కోవాల్సి వస్తుందని శేషు హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: