ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకు మరింత హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. ఏపీలో పాలిటికల్ వాతావరణం  హీట్ పడ్డ స్థాయికి చేరుకోవడంతో, రాజకీయ నాయకులకు కూడా ప్రతిరోజు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. ఎప్పుడెప్పుడు ఏ వార్త వెలువడుతుందో, ఎప్పుడు ఏ అంశం పెద్ద చర్చగా మారుతుందో అనే అనిశ్చితి పరిస్థితి పెరిగిపోయింది. ముఖ్యంగా ఇప్పుడు ప్రజలు పాత ప్రభుత్వ పథకాలతో ప్రస్తుత కూటమి ప్రభుత్వ పథకాలను పోల్చుతూ, సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను ఘాటుగా వ్యక్తపరుస్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్షం నుండి, ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా, ఎన్నో విమర్శలు వచ్చాయి. అయితే ఆ విమర్శలకు గట్టిగా సమాధానం చెప్పే స్థితిలో ప్రభుత్వం ఎక్కువగా కనబడలేదు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు వెనుక ఉన్న పచ్చ మీడియా చానెల్స్‌ అన్నీ కూడా ఆయన చేసిన ప్రతీ పనిని ప్రశంసిస్తూ, ఆయనను పొగడటమే ఒక ప్రధాన కర్తవ్యంలా భావించేవి. ఈ కారణంగా పచ్చ మీడియాపై ప్రజల్లో ఎప్పటినుంచో ఒక నెగిటివ్ ఇమేజ్ ఏర్పడింది.


కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. పచ్చ మీడియాగా పేరుగాంచిన ప్రముఖ ఛానెల్ ఒక్కసారిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ప్రశంసిస్తూ, చంద్రబాబుపై విమర్శలు చేస్తూ వార్తను ప్రచురించింది. అంతే కాకుండా విద్యా రంగంలో జగన్ పాలనలో సాధించిన విజయాలను హైలైట్ చేస్తూ, చంద్రబాబు పాలనలోని లోపాలను బహిరంగంగా చూపించింది. ఈ సంఘటనతో ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో, ముఖ్యంగా టిడిపి వర్గాల్లో, పెద్ద షాక్ వేవ్ లా మారింది.



ఈ వివాదానికి మూల కారణం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం తాజా ర్యాంకులు. ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ (ణీఋF) ప్రకటించిన 2025 ర్యాంకుల ప్రకారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఓవరాల్ విభాగంలో 84వ స్థానంలో నిలిచింది. 2024లో ఇదే విశ్వవిద్యాలయం 59వ స్థానంలో ఉండగా, ఇప్పుడు ర్యాంకు పడిపోవడం విద్యా రంగంపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందన్న భావనకు దారితీసింది. జగన్ ప్రభుత్వం ఉన్నప్పటి ర్యాంకు ఇప్పుడు పడిపోవడం వల్ల ఈ అంశం మరింత హాట్ డిబేట్‌గా మారింది.



సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రజలు కూటమి ప్రభుత్వంపై విపరీతంగా మండిపడుతున్నారు. విద్యా రంగం వంటి కీలక విభాగాలను పక్కనబెట్టి, పదవుల కేటాయింపులకే ప్రాధాన్యం ఇస్తున్నారని, రాజకీయ లబ్ధి కోసం మాత్రమే కష్టపడుతున్నారని విమర్శిస్తున్నారు. ఇదే అంశాన్ని పచ్చ మీడియా ఛానల్ కూడా స్పష్టంగా రాయడం విశేషం. ఈ చానల్ ఎప్పుడూ చంద్రబాబు నాయుడిని ప్రశంసిస్తూ వార్తలు రాస్తూ ఉండేది. కానీ ఈసారి మాత్రం "ఈ విషయంలో జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబుకంటే బెటర్" అని రాయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది తెలిసి చేసిన పబ్లిసిటీనా, లేక అనుకోకుండా రాసిన నిజాయితీ మాటలనా అన్నది పక్కన పెడితే, సోషల్ మీడియాలో వైఎస్ఆర్‌సీపీ అభిమానులు ఈ వార్తను విపరీతంగా వైరల్ చేస్తున్నారు. "ఇన్నాళ్లకి పచ్చ మీడియా సరిగ్గా వార్త రాసింది" అంటూ పచ్చ మీడియా ఛానల్‌ను కూడా ప్రశంసిస్తున్నారు.



ఇక ఈ సంఘటనతో రాజకీయ వర్గాల్లో కొత్త చర్చలు మొదలయ్యాయి. పచ్చ మీడియా ఛానల్ ఈ విధంగా వైఎస్ జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా రాయడం వెనుక ఉన్న కారణాలపై అనేక ఊహాగానాలు చెలరేగుతున్నాయి. కానీ ఒక్క విషయం మాత్రం నిజం—విద్యా రంగంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ర్యాంకు పడిపోవడం, ప్రభుత్వ పనితీరు పై నెగిటివ్ కామెంట్స్ రావడం, అదే సమయంలో పచ్చ మీడియా ఈ విషయంలో వైఎస్ జగన్‌కు క్రెడిట్ ఇవ్వడం—ఇవన్నీ కలిపి రాజకీయ చర్చలకు మరింత వేడి తెచ్చేశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: