బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేశాక ఆమె జాగృతి పేరుతో కొత్త పార్టీ పెడతారు అనే వార్తలు ఎన్నో సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలోనే కొత్త పార్టీ పెట్టడంపై సంచలన వ్యాఖ్యలు చేసింది కవిత.తాజాగా హైదరాబాదులోని ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్న కవిత మాట్లాడుతూ.. నేను కాంగ్రెస్ లోకి వెళ్తున్నాను అనే వార్తలు అవాస్తవం. బహుశా సీఎం రేవంత్ కాంగ్రెస్ నుండి బయటకు వెళ్తున్నారు కావచ్చు. అందుకే ఆయన భయపడుతున్నారు కావచ్చు. నన్ను కాంగ్రెస్ పెద్దలు ఎవరూ కలవలేదు. కాంగ్రెస్ లోకి వెళ్లే ఆలోచన కూడా నాకు లేదు. అలాగే తండ్రి పార్టీ నుండి సస్పెండ్ అయిన ఏకైక కూతుర్ని  నేనే.. 

అలాగే నాకు హరీష్ రావు పై కూడా వ్యక్తిగతంగా ఎలాంటి కోపం లేదు. ఒక కాళేశ్వరం అంశంలో తప్ప.. ఇరిగేషన్ పై 2016 లోనే కేటీఆర్ కి చెప్పాను.కానీ కాళేశ్వరం కింది స్థాయి కమిటీ వాళ్లు పరిశీలించకుండానే నేరుగా సీఎం దగ్గరికి ఫైల్స్ వెళ్లాయి. ఈ విషయం జస్టిస్ పిసి ఘోష్ కమీషన్ చూస్తే అన్ని అర్థమవుతాయి.. అలాగే కొత్త రాజకీయ పార్టీ గురించి ఆలోచన చేస్తున్నాను. నాన్న కూడా పార్టీ పెట్టే ముందు ఎంతోమంది మేధావుల సూచనలు తీసుకున్నారు. నేను కూడా అలాంటి సూచనలే తీసుకుంటున్నాను. అలాగే రాజకీయాల్లో కొత్త పార్టీ పెట్టాలంటే ఎవరు స్పేస్ ఇవ్వరు తొక్కుకుంటూ వెళ్లాల్సిందే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది కవిత..

 అంతేకాకుండా బీసీ రిజర్వేషన్ల గురించి ప్రభుత్వం ఎలాంటి స్పందన ఇవ్వకపోతే కచ్చితంగా నిరసనలు తెలుపుతామని, రాజకీయాల్లోకి కొత్త పార్టీలు వస్తే స్వాగతిస్తాం అంటూ మాట్లాడారు. అలాగే ఆదివారం రోజు జరిగే చిన్న బతుకమ్మ సెలబ్రేషన్స్ లో చింతమడకలో కచ్చితంగా పాల్గొంటానని చెప్పింది. అంతేకాకుండా ఎమ్మెల్సీ పదవికి నాజీనామా చేశానని దీన్ని ఆమోదించాల్సిందిగా మండల చైర్మన్ ని కోరానని కూడా ఈ ప్రెస్ మీట్ లో తెలిపింది. మరి కొత్త పార్టీ గురించి సలహాలు తీసుకుంటున్నానని కవిత చెప్పింది కాబట్టి త్వరలోనే కొత్త రాజకీయ పార్టీ పెడుతుందా.. లేక తండ్రికి ఎదురు తిరగలేక కొద్దిరోజులు అయ్యాక మళ్ళీ బీఆర్ఎస్ లోనే కొనసాగుతుందా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: