హైదరాబాద్ మహానగరంగా పెట్టింది పేరు. రోజురోజుకి అభివృద్ధి చెందుతూ విశ్వనగరంగా మారుతోంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో కూడా రోజురోజుకి అభివృద్ధి చెందుతోంది హైదరాబాద్. ఇప్పుడు తాజాగా భూమి ధరల విషయంలో కూడా రికార్డు స్థాయిలో ధర పలికినట్లు తెలుస్తోంది. వాటి గురించి పూర్తి గా చూద్దాం.


అసలు విషయంలోకి వెళ్తే హైదరాబాదులోని రాయదుర్గంలోని ప్రాంతంలో నాలెడ్జ్ సిటీ వద్ద ఉన్న ప్రభుత్వ స్థలం వేలం వేయగా.. ప్రారంభం ధర రూ .101 కోట్ల రూపాయలకు టీజీఐఐసీ వేసింది.. చివరకు ఈ భూమి ఎకరాకు MNS రియల్టి సంస్థ రూ. 177 కోట్ల రూపాయలకు వేలంలో దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ వేలంలో పాల్గొన్న ఎంఎస్ఎన్ రియల్ ఎస్టేట్ సంస్థ 7.67 ఎకరాల భూమిని సొంతం చేసుకున్నట్లుగా తెలియజేశారు. ఇందుకు గాను ఎకరా భూమికి రూ.177 కోట్ల రూపాయలు చొప్పున మొత్తం మీద రూ. 1,357 కోట్ల రూపాయలను చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ ధర దక్షిణ భారతదేశంలోనే అత్యధికంగా ఎకరా ధరగా ఉన్నట్టుగా పలువురు విశ్లేషకులు తెలియజేస్తున్నారు.


అలాగే మరో 11 ఎకరాలకు వేలం కొనసాగబోతున్నట్లు వినిపిస్తున్నాయి. గతంలో కూడా కోకాపేటలో ఎకరా రూ.100 కోట్ల రూపాయలకు పైగా అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. MSN రియాల్టీ సంస్థ హైదరాబాదులోని లగ్జరీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు అభివృద్ధి చేసే సంస్థగా పేరు సంపాదించింది. 2024 నుంచి ఈ సంస్థని ప్రారంభించారు. చాలా నాణ్యత మైన దృఢమైన సరికొత్త డిజైన్తో హై అండ్ అపార్ట్మెంట్లను నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. హైదరాబాద్లో నాణ్యమైన లగ్జరీ  స్థలాలను ప్రజలకు అందించాలనేదే ఈ సంస్థ యొక్క ఉద్దేశము. రాబోయే ఐదేళ్లలో కూడా నియోపోలీస్, 20 మిలియన్ చదరపు అడుగుల నిర్మాణాలను అభివృద్ధి చేయాలని లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. మరి మొత్తానికి హైదరాబాదులో పలికిన ఈ ధర మరి ఏపీలో భూముల ధర పెరగడానికి కారణమవుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: