బంగారం రోజురోజుకి ధరలలో మార్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. దీంతో బంగారం కొనాలంటే చాలామంది వెనకడుగు వేస్తున్నారు.కేవలం 7 నెలల కాలంలోనే బంగారం 1000 డాలర్ల వరకు పెరిగింది. ఇండియా చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలోనే ఇంత దారుణంగా ఎప్పుడు కరగలేదు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు వచ్చాయి అది ఎప్పుడంటే 1932లో ఔన్స్ బంగారం 20.69 డాలర్లు. అయితే అప్పట్లో అమెరికాలో బ్యాంకులు, స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోవడం, కర్మ గారాలు మూతపడడంతో ప్రపంచమంతా ప్రభావం కనిపించింది. దీంతో బంగారం మీద అందరూ ఆసక్తి పెంచుకోవడంతో ఆ సమయంలో 20.69 డాలర్ల ఔన్స్ కి పెరిగింది.


అదే సందర్భంలో 1945లో మళ్లీ అలాంటి పరిస్థితి ఏర్పడింది. 33.65 డాలర్లు అప్పుడు. రెండవ ప్రపంచ యుద్ధం రావడం1939 నుంచి1945 దాకా పెరగడం ప్రధాన కారణంగా మారింది. ఔన్స్ బంగారం ధర 1939లో 34.42 డాలర్లు ఉండగా.. 1945 యుద్ధం ముగిసే నాటికి 35 డాలర్ల వరకు పెరిగింది. ది బ్రిటన్ ఫుడ్ సమావేశంలో తీసుకుని నిర్ణయం ప్రకారం ఈ ధర పలికింది. మళ్లీ 1971లో ఇలాంటి పరిస్థితి ఎదురయ్యింది. అప్పటికి 35 డాలర్లు కలదు.1971 ఆగస్టు 15న అమెరికా జోక్ రీచర్డ్ నెక్సన్ బ్రిటన్ ఫుడ్ సిస్టం రద్దు చేయడం, డాలర్లను బంగారంలోకి మార్చబొమంటు తేల్చి చెప్పడం డాలర్ విలువకు పూచిగా బంగారం ఉండదని తేల్చి చెప్పడంతో డాలర్ ప్రాధాన్యత తగ్గిపోయి బంగారం విలువ ఒక్కసారిగా పెరిగిపోయింది.


మళ్లీ 1980లో ఔన్స్ బంగారం ఏకంగా 850 డాలర్లు పలికింది. అప్పుడు చమురికి పెద్ద సంక్షోభం రావడం, ద్రవ్యోల్బణం, రష్యా ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం. వీటి కారణం వల్ల బంగారం మీద అందరి దృష్టి పెరిగి పెరిగింది. మళ్లీ 2011లో 1900 కీ చేరింది. లెమన్ బ్రదర్స్ దివాలా తో మొదలైన ప్రపంచ ఆర్థిక సంక్షోభం వల్ల యూరప్ దేశాలు అప్పుల పాలయ్యాయి. ఆ సమయంలో బంగారం మీద పెట్టుబడులు మంచివని వాటి మీద మక్కువ చూపారు. 2020 వచ్చేసరికి ఏకంగా 1773  అదనంగా పెరిగింది. ఆ సమయంలో కరోనా వైరస్, ప్రపంచమంతా ముప్పు ఇలా ఎన్నో దేశాలు ఆర్థికంగా కృంగిపోయాయి. 2025లో 4,200 ఔన్స్ కి చేరింది. రష్యా యుద్ధం వల్ల బంగారం ధరలు పెరగడం మొదలయ్యాయి. దీంతో చాలామంది ఇప్పుడు బంగారు కాయిన్స్, బిస్కెట్లు వంటివి కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: