వైయస్ రాజశేఖర్ రెడ్డి కేవీపీల మధ్య అనుబంధం ఎలా ఉండేదో చెప్పనక్కర్లేదు. రాజకీయాల్లో మిత్రులు కూడా అప్పుడప్పుడు శత్రువులుగా మారతారు. చాలామంది రాజకీయాల్లో ఎదిగాక తమని నమ్మిన మిత్రుడినే దెబ్బ కొట్టాలని చూస్తారు. కానీ అలాంటిది వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆ స్థానంలో ఉన్నారంటే ఒకరకంగా కేవీపీ లాంటి మంచి స్నేహితుడు కూడా కారణం అని చెప్పుకోవచ్చు.కేవీపీలాంటి స్నేహితులు రాజకీయాల్లో ఇప్పట్లో రారు రాలేరు అనుకునే లోపే వెలుగులోకి వచ్చారు వేం నరేందర్ రెడ్డి.ఒకప్పుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కి కేవీపీ ఎలా అయితే ఉన్నాడో ఇప్పుడు తెలంగాణ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వేం నరేందర్ రెడ్డి అలాగే ఉన్నారు. వేం నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి ల అనుబంధం చూస్తూ ఉంటే ఒకప్పటి వైఎస్,కేవీపీల స్నేహబంధం గుర్తుకు వస్తుందని చాలామంది మాట్లాడుకుంటున్నారు. అలా తెలుగుదేశం పార్టీ వీరిద్దరిని కలిపింది. అప్పటినుండి ఇప్పటివరకు వీరిద్దరి మధ్య స్నేహం చెక్కు చెదరడం లేదు. రేవంత్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చాక ఎన్నో ఇబ్బందులు పడ్డారు. 

కానీ ఆ ఇబ్బందుల్లో కూడా రేవంత్ రెడ్డి వెన్నంటే ఉండి మద్దతుగా నిలిచారు. వేం నరేందర్ రెడ్డి రేవంత్ కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించి నేనున్నానని చేయూత అందించారట.ఇక రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి వచ్చాక తన ప్రాణ స్నేహితుడి కోసం వేం నరేందర్ రెడ్డి కూడా టిడిపి తో బంధం తెంచుకొని రేవంత్ తో కాంగ్రెస్ లో చేరారు.ఇక వేం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఎంతటి గౌరవం ఇస్తారో రేవంత్ కూడా వేం నరేందర్ రెడ్డి పట్ల అలాంటి గౌరవాన్నే చూపిస్తారు. రాజకీయాల్లో అయినా, వ్యక్తిగత జీవితంలో అయినా సరే వేం నరేందర్ రెడ్డి సలహాలు సూచనలు తీసుకుంటారట. అయితే గతంలో టిడిపి పార్టీలో ఉన్న సమయంలో వేం నరేందర్ రెడ్డి కి ఎమ్మెల్సీ రాకుండా రేవంత్ రెడ్డి అడ్డుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కానీ అందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియదు. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నెల రోజులకే రేవంత్ వేం నరేందర్ రెడ్డి మీద ఉన్న స్నేహాన్ని చాటుకున్నారు.

వేం నరేందర్ రెడ్డిని సీఎం సలహాదారుగా నియమించుకున్నారు. అప్పటినుండి ప్రతి ఒక్క పార్టీ కార్యక్రమాలలో వేం నరేందర్ రెడ్డి ప్రముఖంగా కనిపిస్తారు. ఇక రేవంత్ రెడ్డిని కలవాలని కలవలేకపోయినా చాలామంది వేం నరేందర్ రెడ్డిని కలుస్తూ ఉంటారు.ఇక బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంతోమంది మొదట వేం నరేందర్ రెడ్డిని కలిసి ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారట. అలా ఒకప్పుడు వైయస్ రాజశేఖర్ రెడ్డికి కేవీపీ ఎలా ఉండేవారో ఇప్పుడు రేవంత్ రెడ్డికి వేం నరేందర్ రెడ్డి అలాగే ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా వైఎస్ ఏ పని చేసినా కేవీపీ కి చెప్పకుండా చేసేవారు కాదు.అలా ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా వేం నరేందర్ రెడ్డి కి చెప్పకుండా ఏ పని కూడా చేయడం లేదట. ఆయనకు చెప్పే ఆయన సలహా తీసుకున్నాకే ఆ పనిలో ముందుకు వెళ్తున్నారట.అలా ఈ విషయం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారడంతో చాలామంది ఒకప్పుడు వైయస్ కి కేవీపీ ఎలాగో ఇప్పుడు రేవంత్ కి వేం నరేందర్ రెడ్డి అలాగా అంటూ మాట్లాడుకుంటున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: