బెయిల్ వస్తుందన్న నమ్మకంతో సదరు కేసులో పెద్ద సీన్లు చేసిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కి గట్టి షాక్ తగిలింది. పోలీసుల ముందు కూడా “ఇంకా రెండు రోజుల్లో బెయిల్ వస్తుంది, బయటికి వస్తాను” అని గర్వంగా చెప్పిన ఆయనకు సుప్రీంకోర్టు గట్టి ఎదురుదెబ్బ ఇచ్చింది. ఆయనతో పాటు మరో ఏడుగురు నిందితుల బెయిల్ పిటిషన్లను మంగళవారం సుప్రీంకోర్టు సూటిగా తిరస్కరించింది. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రాజ్ కేసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, భూనేటి చాణిక్య, వెంకటేష్ నాయుడు, బాలాజీ కుమార్, నవీన్ లపై సిట్ దర్యాప్తులో తీవ్రమైన ఆర్థిక అవకతవకలు బయటపడ్డాయి. అక్రమ డబ్బు రవాణా, లైసెన్సు కుంభకోణం, కాంట్రాక్టుల లూప్‌లో డబ్బు మార్పిడి వంటి అంశాల్లో ఈ నిందితుల ప్రమేయం స్పష్టమైందని సిట్ నివేదికలో పేర్కొంది.

అరెస్టు తర్వాత జైలులో ఉన్న చెవిరెడ్డి తరచుగా అనారోగ్యాన్ని సాకుగా చూపిస్తూ ఆస్పత్రికి తరలించుకుంటూ ఉన్నారు. అక్కడే కుమారుడు మరియు సహనిందితుడైన వ్యక్తితో గోప్యంగా సమావేశాలు జరిపినట్లు విచారణలో బయటపడింది. ఈ చర్య నిబంధనలకు విరుద్ధమని పోలీసులు సాక్ష్యాలతో కోర్టుకు తెలియజేశారు. ఇప్పటికే ఈ కేసులో కొంతమంది నిందితులకు బెయిల్ లభించింది. కానీ సిట్ ఆ బెయిల్‌లను రద్దు చేయమని హైకోర్టులో పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ విచారణ పూర్తయ్యే వరకు కొత్త బెయిల్ పిటిషన్‌లను చూడవద్దని హైకోర్టు సూచించింది. దీంతో చెవిరెడ్డి & కో సుప్రీంకోర్టు దిశగా వెళ్లారు. అయితే అక్కడ కూడా అదృష్టం కలిసిరాలేదు.

సుప్రీంకోర్టు కూడా “ఇప్పుడే బెయిల్ ఇవ్వడానికి ఆధారం లేదు” అంటూ క్లియర్‌గా చెప్పేసింది. ఈ తీర్పుతో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆశలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. గతంలో “బయటికి వచ్చాక చూద్దాం” అని చెప్పిన ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా కూడా పెద్దగా చర్చనీయాంశమయ్యాయి. వైసీపీ హయాంలో కీలక నాయకుడిగా ఉన్న చెవిరెడ్డి ఇప్పుడు జైల్లోనే రోజులు లెక్కపెడుతున్నాడు. సిట్ దర్యాప్తు వేగం పెరగడంతో ఆయనకు మరోసారి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. మొత్తానికి “బెయిల్ వస్తుందయ్యా” అన్న చెవిరెడ్డి మాటలు ఇప్పుడు “బెయిల్ పోయిందయ్యా”గా మారిపోయాయి..!

మరింత సమాచారం తెలుసుకోండి: