"అమరావతిని పట్టించుకోకుండా, డేటా సెంటర్‌ను విశాఖలో ఎందుకు పెడుతున్నారు?" అని బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ నేతలు కూడా తర్కానికి నిలబడని ప్రశ్నలు వేశారు. అసలు విషయం ఏంటో తెలుసుకోకుండా, ప్రభుత్వ నిర్ణయాన్ని గుడ్డిగా వ్యతిరేకించడమే పనిగా పెట్టుకోవడంతో వైసీపీ నేతలు నవ్వులపాలు అయ్యారు. జగన్ క్లారిటీ: నేతలకు చెంపపెట్టు! .. విదేశాల నుంచి రాష్ట్రానికి తిరిగి వచ్చిన పార్టీ అధినేత జగన్ రెండు రోజుల క్రితం మీడియాతో మాట్లాడినప్పుడు, గూగుల్ డేటా సెంటర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. డేటా సెంటర్ విషయంలో వైసీపీ నేతల ఆరోపణలకు విలువ లేకుండా చేశారు. జగన్ ఏమన్నారు?: గూగుల్ డేటా సెంటర్ వల్ల భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI), క్వాంటమ్ కంప్యూటింగ్ వంటివాటికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని, భవిష్యత్తులో మార్పునకు ఇదే ముఖ్య భూమిక అని సానుకూలత వ్యక్తం చేశారు.
క్రెడిట్ వార్: అంతేకాదు, డేటా సెంటర్ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని చెప్పి, ఈ ఒప్పందానికి తమ హయాంలోనే బీజం పడిందని, అదానీతో తాము గతంలో కుదుర్చుకున్న ఒప్పందంలో రిక్రియేషన్ సెంటర్, ఐటీ పార్క్, స్కిల్ సెంటర్ ఏర్పాటు వంటి ప్రణాళికలు ఉన్నాయని క్రెడిట్ కొట్టేయడానికి ప్రయత్నించారు.పాలసీపై క్లారిటీ కొరవడిందా? .. జగన్ వ్యాఖ్యలతో, తమ అధినేత మనసులో ఏముందో కూడా తెలియకుండా ఉత్తరాంధ్ర నేతలు చేసిన విమర్శలు తేలిపోయాయి. డేటా సెంటర్ వంటి ముఖ్యమైన అంశాలపై కూడా పార్టీలో సరైన అవగాహన, సమన్వయం లేదన్న విషయం మరోసారి బట్టబయలైంది. అధినేత ఒక దిశలో ఆలోచిస్తుంటే, నేతలు మాత్రం గుడ్డి వ్యతిరేకతతో మాట్లాడటం వైసీపీలోని అంతర్గత గ్యాప్‌ను స్పష్టంగా కనిపిస్తోంది. ఈ గ్యాప్ రానున్న రోజుల్లో పార్టీకి మరిన్ని తలనొప్పులు తెచ్చేలా కనిపిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి