ఏపీలో జిల్లాల పున‌ర్ విభ‌జ‌న‌లో మార్పులు , చేర్పులు చోటు చేసుకోబోతున్నాయి. కొత్త‌గా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు, రంపచోడవరం రెవెన్యూ డివిజన్లను తూర్పుగోదావరి జిల్లాలో కలపాలని నిర్ణ‌యం తీసుకున్నారు. అలాగే ప్ర‌కాశం జిల్లాలోని ప‌శ్చిమ ప్రాంతం మార్కాపురం తో పాటు, మ‌ద‌న‌ప‌ల్లి కేంద్రాలుగా రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయ‌నున్నారు. అలాగే ప‌లు జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామాల సరిహద్దుల్లో మార్పులు, చేర్పులు కూడా చేయ‌నున్నారు. పుంగనూరు / పీలేరు, అద్దంకి, గిద్దలూరు, మడకశిర కేంద్రాలుగా నాలుగు కొత్త‌ రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని మంత్రి వ‌ర్గ ఉప సంఘం త‌మ నివేదిక‌లో పేర్కొంది.


అలాగే అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేట ఏర్పాటు చేస్తారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసిన అశాస్త్రీయ విభజనను సరిదిద్దేందుకు ఇప్పుడు మార్పులు , చేర్పులు చేయాల‌ని సూచిస్తున్నారు. ఇక తూర్పు ఏజెన్సీ లోని చింతూరు, రంపచోడవరం డివిజన్ల పరిధిలోని గ్రామాలు జిల్లా కేంద్రమైన పాడేరుకు చాలా దూరంలో ఉండ‌డంతో అక్క‌డ ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు. ఈ రెండు డివిజ‌న్ల‌తో ప్ర‌త్యేక జిల్లా ఏర్పాటు చేసినా చాలా చిన్న‌ది అవుతుంది.


అందుకే ఈ రెండు డివిజ‌న్ల‌ను తూర్పు గోదావ‌రి జిల్లాలో క‌ల‌పాల‌ని ప్ర‌తిపాదించారు. ఇప్ప‌టికే ఏపీలో 26 జిల్లాలు ఉన్నాయి. అందుకే ఈ రెండు డివిజ‌న్ల‌ను తూర్పు గోదావ‌రి జిల్లాలో క‌ల‌పాల‌ని నిర్ణ‌యించారు. అదే జ‌రిగితే అప్పుడు తూర్పు గోదావ‌రి జిల్లాలోని మండలాల సంఖ్య 19 నుంచి 30కి పెరుగుతుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాడేరు రెవెన్యూ డివిజన్‌ మాత్రమే ఉంటుంది. 11 మండలాలకే పరిమితమవుతుంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: