2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కలిసిన విధానం, ఓట్ల విభజన లేకుండా ఒక్కబాటలో నడవడం వలన ప్రజల్లో విశ్వాసం పెరిగింది. ఫలితంగా కూటమి దాదాపు 60 శాతం ఓటు షేర్‌ను సాధించింది. ఈ బలమైన మద్దతును చంద్రబాబు ఇప్పుడు సుస్థిరం చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. పార్టీ స్థాయిలో, ప్రభుత్వ స్థాయిలో సమన్వయం స్పష్టంగా కనిపిస్తోంది. మరో వైపు వైసీపీ మాత్రం 2019లో ఉన్న ఉత్సాహాన్ని కోల్పోయినట్లు తెలుస్తోంది. ఓటమి తరువాత జగన్ పెద్దగా ప్రజల్లోకి రాకపోవడం, పార్టీ కేడర్ మోటివేషన్ తగ్గిపోవడం వంటి అంశాలు వైసీపీని బలహీన పరుస్తున్నాయి. అదే సమయంలో టీడీపీ కూటమి మాత్రం ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో చురుకుగా పనిచేస్తోంది.
చంద్రబాబు ఇప్పుడు స్పష్టంగా చెబుతున్నారు - “ఒకే పార్టీ పదికాలాలు అధికారంలో ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి క్రమబద్ధంగా సాగుతుంది” అని. ఆయన ఈసారి వైసీపీని ఎక్కడా లైట్ తీసుకోవడం లేదు. ప్రతీ సందర్భంలో ప్రత్యర్థి పార్టీ బలహీనతలను సరిగ్గా వినియోగించుకుంటూ ముందుకు సాగుతున్నారు. మొత్తానికి చూస్తే, ఈసారి ఏపీ రాజకీయ చదరంగంలో అన్ని గేమ్స్ బాబే ఆడుతున్నారు. వైసీపీ తమ బలహీనతలను సరిదిద్దుకోకపోతే 2029లో కూడా అదే ఫలితాలు పునరావృతం అయ్యే అవకాశం ఉంది. చంద్రబాబు మాత్రం పూర్తి మాస్ అప్రోచ్‌తో, అనుభవంతో, వ్యూహాత్మకంగా రాజకీయాలను నడిపిస్తూ రాష్ట్రాన్ని కొత్త దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి