ఆంధ్ర ప్రదేశ్ రాజధాని నిర్మాణానికి గాను ఇంతవరకు ముప్పై కోట్ల రూపాయల వరకు విరాళాలు అందాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను రాజధాని నిర్మాణం కోసం విరాళాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.దానికి స్పందించి అనేకమంది విరాళాలు ఇస్తున్నారు.ఇప్పటికి ఈ నాలుగు నెలలలో సుమారు ముప్పై కోట్లు వచ్చాయి. నిజానికి నాలుగు నెలలలో ఇంత మొత్తం రావడం విశేషమే. కాని ప్రభుత్వం చెబుతున్నట్లు లక్ష కోట్ల రూపాయల మేర రాజధాని నిర్మాణానికి అవసరం అవుతుందన్న అంచనాను చూస్తే ,ఇది చాలా తక్కువగానే కనిపిస్తుంది.ఒక కంపెనీ రెండు కోట్ల రూపాయలు ఇవ్వగా,ఒక మహిళ బంగారు ఆభరణాలు విరాళంగా ఇచ్చింది. అయితే ఇటీవలి తుపాను ప్రభావం వల్ల విరాళాలు కొంత తగ్గవచ్చని భావిస్తున్నారు.పైగా తుపాను బాధితులకు విరాళాలు ఇవ్వడానికి పలువురు ముందుకు వస్తున్నారు.కాగా లక్ష రూపాయలు మించి విరాళం ఇచ్చినవారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ధన్యవాదాలు తెలుపుతూ లేఖ రాస్తారు.మిగిలినవారికి ఎస్.ఎమ్.ఎస్. ద్వారా ధాంక్స్ చెబుతారని సమాచారం.ప్రతి ఒక్కరు ఒక ఇటుక అయినా ఇవ్వాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.అయితే ఇక్కడ స్పూర్తిని ప్రదానంగా తీసుకోవాలని, భవిష్యత్తులో రాజధాని విరాళాలు పెరగవచ్చని అదికారులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: