ఈ రోజు దేశ అత్యున్నత పౌర పురస్కారం 'భారతరత్న' అందుకున్న భూపేన్ హజారికా జయంతి. ఈ సందర్భంగా ఆయన జీవితానికి సంబంధించిన కథ మీ కోసం.

భూపేన్ హజారికా అస్సాంలో 8 సెప్టెంబర్ 1926 న జన్మించారు. హజారికా 10 మంది తోబుట్టువులలో పెద్దవాడు. భూపెన్ తన తల్లిని చూసి పాడడాన్ని అభిరుచిగా మలచుకున్నాడు. 10 ఏళ్ళ వయస్సు నుంచే ఆయన అస్సామీ భాషలో పాటలు పాడటం ప్రారంభించాడు. 1936లో భూపేన్ తన మొదటి పాటను రికార్డ్ చేశాడు.

జ్యోతిప్రసాద్ నిర్మించిన 'ఇంద్రమాలతి' చిత్రంలో భూపేన్ రెండు పాటలు పాడారు. 13 సంవత్సరాల వయస్సులో ఆయన తన మొదటి పాటను కూడా రాశాడు. దీంతో భూపేన్ గాయకుడి నుంచి స్వరకర్తగా మారే ప్రయాణం ప్రారంభమైంది. ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూడలేదు. 1942లో అతను తన 12వ తరగతి పూర్తి చేసాడు, ఆ తర్వాత అతను బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి ఎంఏ చేశాడు. చదువు పూర్తయిన తర్వాత భూపేన్ తన స్వస్థలమైన గౌహతికి తిరిగి వచ్చి ఆల్ ఇండియా రేడియోలో పాడటం ప్రారంభించాడు. చదవడం, రాయడం ఇష్టపడే హజారికా బెంగాలీ పాటలను హిందీలోకి అనువదించి పాడేవారు. ఆయనకు అనేక భాషల పరిజ్ఞానం ఉంది.

కొలంబియా యూనివర్సిటీలో హజారిక తన భార్యను మొదటిసారి కలిశారు. అక్కడ తన ప్రదర్శన తరువాత ఆయన ప్రియంవద పటేల్ తో ప్రేమలో పడ్డారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 1950లో భూపేన్, ప్రియంవద అమెరికాలోనే వివాహం చేసుకున్నారు. వారి కుమారుడు తేజ్ హజారిక 1952 లో జన్మించాడు. 1953 లో తన కుటుంబంతో భారతదేశానికి తిరిగి రావాలని భూపేన్ భావించాడు. ప్రియంవద, భూపేన్ భారతదేశానికి వచ్చిన తర్వాత ఎక్కువ కాలం కలిసి ఉండలేదు. కొన్ని నెలల తర్వాత ప్రియంవద ఆర్థిక ఇబ్బందుల కారణంగా భూపేన్ నుండి విడిపోవాలని నిర్ణయించుకున్నారు.

ప్రియంవద నిష్క్రమణ తర్వాత భూపేన్ పూర్తిగా ఒంటరిగా ఉన్నాడు. సంగీతమే ఆయన జీవితం అయ్యింది. భూపేన్ సినిమాల్లో దాదాపు 1000 పాటలు, 15 పుస్తకాలు రాశాడు. ఆయన తన జీవితాన్ని సినిమా రంగానికే అంకితం చేశారు. సంగీత రంగంలో ఆయన చేసిన కృషికి 1992లో హజారికాకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది. 2019లో ఆయన మరణానంతరం దేశ అత్యున్నత పౌర పురస్కారం 'భారతరత్న' కూడా లభించడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: