యాభైలు, అరవైలలోని ప్రముఖ నటి షకీలా స్థానం నేటికీ అభిమానుల మనస్సులో చెక్కు చెదరకుండా ఉంది. 'బాబూజీ ధీరే చల్నా' పాట ప్లే చేస్తే... షకీలా జ్ఞాపకాలు ప్రజల హృదయాలలో, మనస్సులలో సజీవంగా మెదులుతాయి. గురుదత్ చిత్రం 'ఆర్ పార్'తో షకీలా బాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో ‘బాబూజీ ధీరే చల్నా’ పాటతో ప్రేక్షకుల మనసు దోచుకున్నారు ఆమె. ఈ పాటే కాకుండా బాలీవుడ్‌లో ఎన్నో సూపర్‌ హిట్ పాటలతో ప్రేక్షకులను అలరించింది ఆమె.

షకీలా అసలు పేరు
తన మొదటి పాటతోనే బాలీవుడ్‌లో ఫేమస్ అయిన షకీలా అసలు పేరు బాద్షా జహాన్. షకీలా ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ రాజ కుటుంబానికి చెందినవారు. తన కెరీర్‌లో ఎన్నో సూపర్‌ హిట్‌ పాటలను అందించారు. షకీలా చిన్నతనంలో ఆమె అత్త ఫిరోజా బేగం దగ్గర పెరిగింది. ఈరోజు ఆమె వర్ధంతి సందర్భంగా షకీలా జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.  

షకీలా చిన్నప్పుడు తరచుగా అత్త మణి బేగంతో కలిసి సినిమాలు చూడటానికి వెళ్లేది. అత్త వల్లే ఆమెకు సినిమాల పట్ల మక్కువ పెరిగింది. సినిమాలు చూశాక సినిమా అంటే ఇష్టం మొదలైంది. షకీలా 1950లో 'దస్తాన్' సినిమాతో తన సినీ జీవితాన్ని ప్రారంభించింది. 14 సంవత్సరాల వయస్సులో అంటే షకీలా చాలా చిన్న వయస్సులో సినీ ప్రపంచంలో తన కెరీర్‌ను ప్రారంభించింది. 14 ఏళ్లకే 72 సినిమాల్లో నటించారు. దస్తాన్‌తో పాటు, గుమస్తా, సుందర్, రాజ్‌రాణి దమయంతి, సలోని, సింద్‌బాద్ ది సెయిలర్, అగోష్ మరియు అర్మాన్ చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించారు. దీని తరువాత, ఆమె 1953 చిత్రం 'మ్యాడ్‌మాస్ట్'తో ప్రధాన నటిగా తన ప్రయాణంలో కొత్త ఆరంభాన్ని అందుకున్నారు.

1963లో బాలీవుడ్‌ను విడిచి పెట్టిన షకీలా nri వ్యాపారవేత్త జానీ బార్బర్‌ను వివాహం చేసుకుంది. 1963లో ఆమె సినిమాలు చేయడం మానేసి తన భర్తతో కలిసి UKకి షిఫ్ట్ అయింది. అలీబాబా చలి చోర్ విజయం తర్వాత ఆమెకు వరుస సినిమాలు వచ్చాయి. ఆమె 50, 60లలోని స్టార్స్ అందరితో కలిసి పని చేసింది. ఆమెను అప్పట్లో 'ఫెయిరీ క్వీన్ ఆఫ్ ఇండియన్ మూవీస్' అనే ట్యాగ్ తో పిలిచేవారు. 82 ఏళ్ల షకీలా బాంద్రాలో ఉన్న తన ఇంట్లో 20 సెప్టెంబర్ 2017న గుండెపోటుతో కన్నుమూశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: