ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడుకు తాజాగా మరో కరివేపాకు దొరికేసిందా ? అవుననే అంటున్నారు పార్టీ నేతలు. లేటెస్టు కరివేపాకు ఎవరంటే మాజీమంత్రి భూమా అఖిలప్రియేనట. అవును కిడ్నాపు కేసులో అఖిలప్రియ అరెస్టయి ఇప్పటికి పదిరోజులవుతోంది. ఇంతవరకు చంద్రబాబు కానీ లేదా పుత్రరత్నం నారా లోకేష్ కానీ లేకపోతే సీనియర్ నేతలు కానీ ఇంతవరకు అధికారికంగా అఖిలప్రియ అరెస్టుపై స్పందించలేదు.  అయినదానికి కానిదానికి ప్రభుత్వంపై బురద చల్లేస్తు ప్రతిరోజు ఒకటే గోల చేస్తున్న తండ్రి, కొడుకులు కానీ టీడీపీలో ఉన్న మైకాసురులు కానీ అఖిల అరెస్టు గురించి ఎందుకు నోరిప్పటం లేదు ?  రాజకీయాల్లో బిజీగా ఉండేవారు ఏదో వివాదాల్లో తలదూర్చటం, ఇరుక్కోవటం మామూలుగా జరుగుతునే ఉంటుంది.




భూమా ఫ్యామిలికి ఇలాంటి వివాదాలు కొత్తేమీకాదు. బతికున్నపుడు ఆమె తండ్రి భూమా నాగిరెడ్డి పైన భూ ఆక్రమణలు, కేసులు, ప్రత్యర్ధులపై దాడులు చేయటం, కేసులవ్వటం, అరెస్టులు, కోర్టులు, విచారణలు కొత్తేమీకాదు. అలాంటి నేతలు ఇపుడు కూడా టీడీపీలో చాలామందే ఉన్నారు. మాజీమంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, మాజీ ఎంఎల్ఏ జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా అవినీతి, హత్యకు కుట్ర, అక్రమాల కేసుల మీద అరెస్టులయి బెయిల్ తీసుకుని బయట తిరుగుతున్నారు. మరి వాళ్ళ విషయంలో మాత్రం చంద్రబాబు, లోకేష్ లు అప్పట్లో ఎంత గోల చేశారో అందరు చూసిందే. కాకపోతే అప్పట్లో అచ్చెన్న, కొల్లు ఇద్దరు బీసీలు కావటంతో పాటు వాళ్ళను అరెస్టు చేసింది ఏపి పోలీసులే కావటం చంద్రబాబుకు బాగా కలిసొచ్చింది.




కానీ ఇపుడు అఖిలను అరెస్టు చేసింది తెలంగాణా పోలీసులు. అఖిల అరెస్టుపై ఏమన్నా మాట్లాడితే కేసీయార్ కు ఎక్కడ మండుతుందో అనే భయమే తండ్రి, కొడుకుల నోళ్ళను మూయించేసినట్లుంది. పైగా అఖిలతో భవిష్యత్తులో పెద్దగా పనికూడా ఉన్నట్లు లేదు. ఎందుకంటే అరెస్టుకు ముందు కూడా కర్నూలు జిల్లాలో అఖిల దాదాపు ఒంటరైపోయింది. ఏదో అమరావతికి మద్దతుగా జిల్లాలోని ఎవరు మాట్లాడకపోయినా చంద్రబాబు కోసమే అఖిల నొటికొచ్చింది మాట్లాడారు. ఒకటికి రెండుసార్లు అమరావతికి వెళ్ళి రైతులకు మద్దతుగా జరిగిన ఆందోళనలో పాల్గొన్నారు. ఇపుడిక అమరావతి లేదు జిల్లాలో అఖిలతో పనీలేదు. ఆమె అరెస్టు జరిగినా ఎవరినీ నోరిప్పద్దని గట్టిగా ఆదేశాలు జారీ అయినట్లుంది. అందుకనే అఖిల అరెస్టు జరిగి ఇన్నిరోజులైనా ఎవరు నోరిప్పటం లేదు. అంటే చంద్రబాబు జాబితాలో అఖిలప్రయ మరో కరేపాకు లాగ మారిపోయిందని పార్టీలోనే చర్చలు జరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: