నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక దేశ భద్రత విషయంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ముఖ్యంగా ఆర్టికల్ 370 రద్దు. కాశ్మీర్ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలపాలు జరుగుతున్నాయని భావించి ఆర్టికల్ 370 ని రద్దు చేసి కాశ్మీర్ ను కేంద్రం ఆధీనంలోకి తీసుకున్నారు. అంతేకాదు భారత సైన్యంపై దాడి చేసిన వారిని సర్జికల్ స్టైక్ పేరుతో మట్టుబెట్టి పుల్వామా కి ప్రతీకారం తీర్చుకున్నారు.


దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూసిన వారు దేశంలో అల్లకల్లోలం సృష్టించేవారు.. పాకిస్థాన్ లో రాజకీయ నాయకుల్లా, వ్యాపార వేత్తల్లా.. స్వచ్ఛంద సంస్థల ముసుగులో తిరగుతున్న లష్కరే తోయిబా  దగ్గర నుంచి అనేక తీవ్రవాద సంస్థల ఉగ్రవాదులు ఎక్కడున్నా వారిని కాల్చి చంపిన ఉదంతాలు మనం చూస్తున్నాం. దేశ భక్తిలో పంజాబీలను మించిన వారు లేరు. కానీ వాళ్ల ముసుగులో దేశాన్ని ముక్కలు చేయాలని భావించిన ఖలీస్థానీ తీవ్రవాదులను మట్టుబెట్టాం.


అందులో భాగంగా పంజాబ్ లో జరుగుతున్న కదలికలు ఒకటైతే.. దాని  ఫలితంగా వీరంతా పారిపోయి ప్రపంచ వ్యాప్తంగా విస్తృతమయి అక్కడి నుంచి వీరు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్, కెనెడా తల దాచుకున్నారు. అక్కడున్న కొంత మందికి అక్కడి ప్రభుత్వాల ద్వారా భారత్ ప్రభుత్వం బుద్ధి చెప్పింది. అర్విందర్ రిండా, బషీర్ అహ్మద్, పరమ్జిత్ పంజ్వర్, ఖలీద్ రజాలు పాకిస్థాన్ లో, హ్యబీస్ అంగేరా ఇటలీ, అవతార్ ఖండా బ్రిటన్, ఐజాద్ అహ్మద్ లూన్ అఫ్గానిస్థాన్,  హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడాలో మరణించారు. వీరంతా ప్రముఖ ఖలీస్థానీ ఉగ్రవాదులు ఆరు నెలల్లో రకరకాల ప్రమాదాల్లో చనిపోయారు.


ఐస్‌ దేశాల కూటమి ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా, అమెరికా, న్యూజిలాండ్ లు ఒకరి కొకరు సమాచారం ఇచ్చుకుంటూ ఉన్నారు. ఇవన్నీ వీళ్ల దేశాల్లోనే జరిగాయి. దీని ద్వారా ఇది పాత భారతదేశం కాదు.. తమకు ముప్పు చేసేవాళ్లు ఎక్కడున్నా వెతికి మరీ చంపుతోంది.. వదిలిపెట్టదు అనే సంకేతం అయితే వెళ్లింది.

మరింత సమాచారం తెలుసుకోండి: