మనిషిగా పుట్టిన తరువాత మరణించక తప్పదు అని తెలియక ఎంతోమంది మనుషులు చాలా వాటికోసం పాకులాడుతూవుంటారు. కానీ మనము చనిపోయాక మనతో ఏమీ తీసుకు పోలేము. కాబట్టి మనుషులు మానవత్వాన్ని మరిచిపోయి మనుషులకన్నా ఇతర వనరులకు ఎక్కువ విలువిస్తున్నారు.  అయితే మరణించే ముందు మనుషులలో కొన్ని మార్పులు, లక్షణాలు కనిపిస్తాయి. వారి శరీరం రంగు మారిపోవడం లేదా వారి అంగిలి తడి ఆరి పోవడం లాంటివి జరుగుతాయి. అంతేకాకుండా కళ్లు కూడా మసకబారతాయి.

అటువంటి పరిస్థితుల్లో కళ్లు తెరిస్తే జననం.. కళ్లు మూస్తే మరణం ఈ రెప్పపాటు కాలమే మన జీవితం అని అంటారు. జనన-మరణాలు మన చేతిలో ఉండవు. ముఖ్యంగా చావు గురించి చెప్పుకుంటే ఈ ప్రపంచంలో అత్యంత అలుపెరుగని నిజం. ఈ సత్యాన్ని ఎవరూ ఖండించలేరు. అదే విధంగా నిరోధించనూ లేరు. శ్రీకృష్ణుడి గీతలో చెప్పినట్లు ప్రతి జీవికి మరణమేది ఉంటుందనేది సత్యం. అయితే ఆ మరణం తర్వాత జీవిలో ఆత్మ వేరొక శరీరంలోకి వెళ్తుంది. ఈ సత్యాన్ని తిరస్కరించలేం. జననం-మరణం అనేది ఆత్మలు తిరుగుతున్న చక్రం లాంటివి. ధనవంతుడు, పేదవారు అందరికీ మరణం రావడం తథ్యమైనప్పటికీ ఒకే విధంగా మాత్రం ఉండదు. ఇది వారు చేసిన కర్మలపై ఆధారపడి ఉంటుంది.

హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం మరణం రెండు రకాలుగా ఉంటుంది. సహజమైన, అసహజమైన మరణాలు అని రెండు రకాలుగా ఉంటుంది. సహజ మరణం అనారోగ్యం వల్ల, శరీరం వృద్ధాప్యంతో అలసిపోయి ఆత్మ బయటకు వెళ్లడంతో సంభవిస్తుంది. అసహజ మరణం అంటే ప్రమాదావశాత్తు సంభవించే ఘటనలు. పాము కాటు, ఆయుధాలు, ఆత్మహత్య ఇలా రకరకాల ప్రమాదాల ద్వారా వచ్చే మరణాలు అసహజమైనవి. అకాల మరణంతో బాధపడుతున్న మనిషి ఆత్మ చంచలమైనంది. ఎందుకంటే వీరికి భౌతిక కోరికలు పూర్తిగా నశించవు. అలాంటి పరిస్థితుల్లో వారి ఆత్మ భూలోకానికి, పరలోకానికి మధ్య కొట్టుమిట్టాడుతుంది. పితృ పక్షంలో వీరి పేరిట పిండ ప్రధానం చేస్తే వారి ఆత్మకు సంతృప్తి, శాంతి చేకూరుతుంది. శివపురాణం, గరుడ పురాణం, కఠోపనిషత్తు సహా అనేక గ్రంథాలు మరణం తదుపరి జీవితాన్ని గురించి వివరిస్తాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: