తెలుగు సంవత్సరంలో మొదటి పండగ ఉగాది. ఈ సృష్టి ఆరంభం అయిన కాలం యొక్క 'ఆది' ఉగాది అయ్యిందని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ సందర్భంగా ఉగాది పండుగ రోజున కొన్ని పనులను కచ్చితంగా చేయాలి. ఈ పండుగ ఈరోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేచి అభ్యంగ స్నానం చేయాలని పండితులు చెబుతున్నారు. మన శరీరానికి, తలకు నువ్వుల నూనె రాసుకుని, సున్నిపిండి పెట్టుకుని తైలాభ్యంగ స్నానం చేయాలి. అనంతరం ఇంట్లో పూజా మందిరంలో దేవుడిని ఆరాధించిన అనంతరం సూర్య నమస్కారం చేయాలి.

ఇక ఉగాది రోజున దమనేన పూజ చేయాలి. పూర్వకాలంలో ఇవి విరివిగా దొరికేవి. దవనంతో ఉగాది పండుగ రోజు నుండి పౌర్ణమి వరకూ ఒక దేవతా మూర్తిని ఎంతో నియమ నిష్టలతో పూజలు చేయాలి. చైత్ర శుక్ల పాడ్యమి రోజున బ్రహ్మకు. విదియ రోజున శివునికి, తదియ రోజున గౌరీ శంకరులకు, చతుర్థి రోజున వినాయకుడికి, ఇలా పౌర్ణమి వరకు దేవుళ్లకు పూజలు చేయాలి. కొన్ని గ్రంథాలలో హిందూ పురాణాల ప్రకారం, వ్రత గ్రంథాలలో మహాశాంతి చేయాల్సిన సమయం ఉగాది పండుగ నాడే అని చెప్పబడింది. మహాశాంతి చేయడం వల్ల అన్ని దుఃఖాలు తొలగిపోతాయి.

అంతేకాదు.. మహాశాంతి చేయాల్సిన పనుల్లో ఉగాది కూడా ఒకటి. పూర్వకాలంలో ఈ పవిత్రమైన రోజున సంవత్సరేష్టి అనే యజ్ణం చేసేవారని కనిపిస్తుంది. ఉగాది రోజున వినాయకుడిని, నవగ్రహాలను, బ్రహ్మదేవతలను పూజించాలని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి. ఉగాది పచ్చడి. ఉగాది పండుగ రోజున కచ్చితంగా పచ్చడి చేయాలి. ఈ పచ్చడికి నవగ్రహాలకు సంబంధం ఉందని చాలా మందికి తెలియదు.ఇక ఉగాది పచ్చడిలోని తీపికి గురుడు, ఉప్పుకు చంద్రుడు, కారానికి కుజుడు, మిరియాల పొడికి రవి, పులుపుకి శుక్రుడు అన్ని రుచులు కలిపిన వారికి శని, బుధ గ్రహాలు కూడా కారకులవుతారని పండితులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: